సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా 40 సంవత్సరాల నుంచి మెగాస్టార్ తనకంటూ ఉన్న స్టార్ ఇమేజ్ ను మెయిన్ టైన్ చేసుకుంటూ వస్తున్న ఏకైక హీరో చిరంజీవి…అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడి మన్ననలు పొందడమే కాకుండా ఇండస్ట్రీలో మిగతా హీరోల కంటే చిరంజీవిని టాప్ హీరోని చేసింది.ఇక ఆయన చేసిన కమర్షియల్ సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా చిరంజీవి అంటే ఒక బ్రాండ్ అనేలా ఒక మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చాయి.

ఇక ఇదిలా ఉంటే చిరంజీవి( Chiranjeevi ) చాలామంది దర్శకులతో సినిమా చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.అయితే చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీకి వచ్చిన పూరి జగన్నాథ్ ( Puri Jagannadh )డైరెక్షన్ లో మాత్రం చిరంజీవి ఇప్పటివరకు సినిమా చేయలేదు.దానికి కారణం ఏంటి అని చిరంజీవి అభిమానులు పూరి అభిమానులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.నిజానికి పూరి జగన్నాధ్ సినిమాలంటే చిరంజీవికి చాలా ఇష్టం…అయినప్పటికీ పూరి ఎప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడు అనేది తెలియదు.
కాబట్టి ఒకసారి ప్లాపిస్తే మరోసారి సూపర్ హిట్ ఇస్తాడు.కాబట్టి ఆయన లాంటి డైరెక్టర్ తో చిరంజీవి చేయడం అనేది కొంత వరకు కష్టమనే చెప్పాలి.ఎందుకంటే చిరంజీవి మినిమం హిట్ ఇచ్చే డైరెక్టర్ తో సినిమా చేస్తాడు.అయితే పూరి సినిమాలో కొంచెం యూత్ ను అట్రాక్ట్ చేసే డైలాగ్ లు ఎక్కువగా ఉంటాయి.
వాటి వల్ల చిరంజీవి ఇమేజ్ అనేది దెబ్బతింటుందేమో అనే ఉద్దేశ్యం లో కూడా చిరంజీవి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఇంతకుముందు చిరంజీవితో సినిమా చేయాల్సిన పూరి మధ్యలో జరిగిన కొన్ని కారణాల వల్ల చేయకుండా వదిలేయాల్సి వచ్చింది.మరి చిరంజీవి తో సినిమా చేయడమే తన డ్రీమ్ అని చెప్పిన పూరి జగన్నాథ్ తన ఎంటైర్ కెరియర్ లో ఒకసారైనా చిరంజీవితో సినిమా చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.