గోపీచంద్( Gopichand ) హీరోగా శివ డైరెక్షన్ లో వచ్చిన సినిమా శౌర్యం( Shauryam ).ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాలో డైలాగ్స్ చాలా సూపర్ గా ఉంటాయి అప్పటివరకు ఏ సినిమాలో లేని విధంగా డైలాగ్స్ ఉంటాయి అయితే ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది ఎవరంటే ఇప్పుడు తెలుగు లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నఅనిల్ రావిపూడి… ఆయన సినిమా కెరియర్ స్టార్ట్ చేసిన మొదట్లో చాలా సినిమాలకి రైటర్ గా పని చేసిన విషయం మనకు తెలిసిందే అయితే శౌర్యం సినిమాకి మంచి డైలాగ్స్ అందించినప్పటికీ ఆయన పేరు టైటిల్స్ లో మాత్రం పడలేదు ఎందుకంటే చాలా డైలాగ్స్ అనిల్ రాసినప్పటికీ కొన్ని డైలాగ్స్ ని డైరెక్టర్ శివ ( Director Siva )అప్పుడు టాప్ రైటర్ గా గుర్తింపు పొందిన ఏం రత్నం గారితో రాయించారు అయితే టైటిల్స్ లో మాత్రం ఎం రత్నం గారి పేరే ఉంటుంది.

ఇక ఈ సినిమా తర్వాత వీళ్ల కాంబో లోనే వచ్చిన శంఖం( Conch ) సినిమాకి డైలాగ్ రైటర్ గా అనిల్ రావిపూడి పేరు పడింది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది ఇక అప్పటి నుంచి అనిల్ రావిపూడి చాలా సినిమాలకి రైటర్ గా చేసినప్పటికీ ఆయన చేసిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు ఇక ఆయన డైరెక్టర్ గా మారి పటాస్ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం బాలయ్య బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు మొత్తం వరుసగా సక్సెస్ సాధించాయి ఇక దీనితో ఈ సినిమా మీద కూడా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పాలి…








