రజనీ, హృతిక్ కలిసి నటించిన సినిమా ఏంటో? అది ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలుసా?

ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చాలా మంది నటులు.ఒకప్పుడు బాల నటులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారే.

సినిమా బ్యాంగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన పలువురు బాల నటులుగా జనాలకు పరిచయం అయ్యారు.అనంతరం హీరోలుగా మారి స్టార్ హీరోలుగా ఎదిగారు.

తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు.కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమల్లోనూ ఇలాంటి నటులున్నారు.

సేమ్ ఇలాంటి కోవలోనికే వస్తాడు బాలీవుడ్ టాప్ స్టార్ హృతిక్ రోషన్.అంతేకాదు.

Advertisement

ఆయన చిన్నప్పుడే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలోనూ నటించాడు.ఇంతకీ వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.హృతిక్ రోషన్ బాల నటుడిగా రజనీకాంత్ సినిమాల్లో నటించిన చక్కటి పేరు సంపాదించుకున్నాడు.1986లో రజనీకాంత్ హీరోగా భగవాన్ దాదా అనే సినిమా వచ్చింది.ఈ సినిమాకు నిర్మాత హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్.

ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రైమ్ కథగా తెరకెక్కింది.అంతేకాదు.

రజనీకి తోడుగా అందాల తార శ్రీదేవి నటించింది.ఈ సినిమాలో రజనీకాంత్ కు పెంపుడు కొడుకు ఉంటాడు.ఆ అబ్బాయి మరెవరో కాదు హృతిక్ రోషన్ నటించారు.

హృతిక్ మంచి క్యారెక్టర్ చేసినా.ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.సినిమా ఫ్లాప్ కు కారణాలు చాలా ఉన్నట్లు అప్పట్లో చర్చలు నడిచాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

అయితే ఈ సినిమాలో నటించడానికి ముందే హృతిక్ ఆశా, ఆప్కే అనే సినిమాల్లో నటించాడు.అయితే రజనీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

ఈ సినిమా తర్వాత చాలా కాలం సినిమాలక దూరంగా ఉన్నా డు హృతిక్.సుమారు 14 సంవత్సరాల తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కహో నా ప్యార్ హై సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఇండియన్ సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హృతిక్.

తాజా వార్తలు