వీరికి సంజయ్ ఎందుకు టార్గెట్ అయ్యారంటే .. ? 

గత కొద్ది రోజులు తెలంగాణ బిజెపిలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ను టాబ్లెట్ చేసుకుంటూ ఆ పార్టీలోని కొంతమంది కీలక నాయకులు బహిరంగంగా విమర్శలు చేస్తుండగా,  మరికొంతమంది అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేస్తూ సంజయ్ హవా ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

 Why Did They Target  Bandi Sanjay  ,  Telangana Bjp, Telangana, Bandi Sanjay, Ni-TeluguStop.com

ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ , బిజెపిలోని సంజయ్ వ్యతిరేక వర్గంగా ముద్రపడిన కొంతమంది నాయకులు విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

వెంటనే సంజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ అరవింద్ కోరారు.

Telugu Bandi Sanjay, Mlc Kavitha, Nijamabadmp, Telangana, Telangana Bjp-Politics

అరవింద్ వ్యాఖ్యలతో తెలంగాణ బిజెపిలో అలజడి రేగింది.ముఖ్యంగా సంజయ్ ను వ్యతిరేకిస్తున్న వారంతా బహిరంగంగా ఆయనపై విమర్శలు చేశారు.అసలు ఒక్కసారిగా ఈ స్థాయిలో విమర్శలు చేయడం వెనుక కారణాలు ఉన్నాయట.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవి కాలం పూర్తయింది.మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సంజయ్ ని కొనసాగించేందుకు అధిష్టానం ఆసక్తి చూపిస్తుంది.

ముఖ్యంగా తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి గా ఉన్న తరుణ్ చుగ్( Tarun Chug ) సంజయ్ ను కొనసాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ వ్యవహారాలు బిజెపిలోని కొంతమంది సీనియర్ నాయకులకు అసంతృప్తి కలిగిస్తోంది.

అందుకే అరవింద్ తోపాటు,  పేరాల శేఖర్ వంటి వారు బహిరంగంగా విమర్శలు చేస్తున్నట్లు అర్థమవుతుంది.సంజయ్ పదవీకాలం పొడిగిస్తున్నట్లు ఢిల్లీలోని బిజెపి పెద్దల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సమయంలో సంజయ్ కు వ్యతిరేకంగా గళం విప్పితే పార్టీలోని నాయకులు సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని అధిష్టానం గ్రహిస్తుందని,  ఆయనను కొనసాగించేందుకు అవకాశం ఉండదనే ఆలోచనతోనే ఈ విధంగా గళం విప్పినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Telugu Bandi Sanjay, Mlc Kavitha, Nijamabadmp, Telangana, Telangana Bjp-Politics

 ముఖ్యంగా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , వివేక్ వెంకటస్వామి , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) వంటి వారు సంజయ్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదట.ఈ నేపథ్యంలో సంజయ్ ను కొనసాగిస్తారా లేక ఆయన స్థానంలో మరో కీలక నాయకుడికి తెలంగాణ బిజెపి బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube