గోపిచంద్ మలినేని కి ఎందుకు తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందంటే..?

వీరసింహ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని గురించి మనందరికీ తెలిసిందే అయితే ఆయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఒక 10 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తరువాత డైరెక్టర్ గా మారి రవితేజతో డాన్ శీను అనే సినిమా చేశారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది దాంతో గోపిచంద్ మలినేని ఇండస్ట్రీ లో ఒక మంచి డైరెక్టర్ అని అందరి దృష్టిని తన మీదికి మరల్చుకున్నాడు.

ఆ తర్వాత ఆయన రెండో సినిమాగా విక్టరీ వెంకటేష్ హీరోగా బాడీగార్డ్ అనే సినిమా చేశాడు.

ఆ తరువాత బలుపు, పండగచేసుకో, విన్నర్ ఇలా వరుస గా సినిమాలు చేసిన గోపిచంద్ మలినేనికి క్రాక్ సినిమా చేసేదాకా ఏ సినిమా ప్రొడ్యూసర్ కూడా తనకి రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వలేదట దాంతో ఆయనకు ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బందులని పోగొట్టుకోవడానికి తన సొంత ఆస్తులని అమ్ముకొని మరి తన అప్పులని తీర్చుకున్నారట అలా అప్పుడు చాలా ఇబ్బందులని ఎదురుకున్నాడట ఇక ఇలా ఉంటే కెరియర్ సెట్ అవ్వదు అనుకొని విన్నర్ సినిమా ప్లాప్ తరువాత రియలైజ్ అయి

క్రాక్ సినిమా స్టోరీ రాసుకొని మరి హిట్ కొట్టాలనే కసితో రవితేజ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.దాంతో బాలయ్య తో సినిమా చేసి సక్సెస్ సాధించాడు ప్రస్తుతం ఒక పెద్ద హీరోతో సినిమా చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.దానికి సంభందించిన స్టోరీ రాసి తొందరలోనే సినిమా ని సెట్స్ మీదకి తీసుకెళ్ళి అంతే తొందరగా షూట్ చేసి రిలీజ్ చేసి హైట్రిక్ కొట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

తాజా వార్తలు