వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా రాజ్యసభ అభ్యర్థుల( Rajyasabha Candidates ) ఎంపిక చేపట్టింది.కొన్ని సీట్ల విషయంలో సొంత పార్టీ నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉండడం తో అక్కడ గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని , అలాగే గ్రూపు రాజకీయాలకు నాంది పలుకుతుందని భావించినా కాంగ్రెస్( Congress ) పార్లమెంట్ కు పోటీ చేయాలని భావిస్తున్న నేతలు కొంతమందికి రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించింది.
ఈ ఎంపికల విషయంలో చాలా వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.సీనియర్ నేతలు కొంతమందిని పక్కనపెట్టి యువ నాయకులకు అవకాశం కల్పించింది.
రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి,( Renuka Chowdary ) అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) పేర్లను ప్రకటించింది.ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అభ్యర్థుల ప్రకటన చేశారు.

ఇద్దరు అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ రెండు స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది.అయితే రాజ్యసభ సభ్యత్వంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, అధిష్టానం పెద్దలకు వీర విధేయుడు గా ఉన్న హనుమంతరావు ను( V Hanumantha Rao ) పక్కన పెట్టడం చర్చనీయాంసంగా మారింది.తనకు తప్పకుండా రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వి హనుమంతరావు ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది .ఇక రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ల ఎంపిక చేయడం వెనక చాలా కోణాల్లో నే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.మాజీ కేంద్రమంత్రిగా ఉన్న రేణుక చౌదరి వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేయాలనే ఆలోచనతో ఉంటూ వచ్చారు .అయితే ఈసారి రేణుక చౌదరికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వం ఇచ్చినా ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గ పరిధిలో మెజార్టీ కాంగ్రెస్ నాయకులు రేణుక అభ్యర్థిత్వన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీంతో ఆమెను పోటీకి దించినా కాంగ్రెస్ నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం వ్యవహాత్మకంగా ఆమెను రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకుంది.

ఇక అనిల్ కుమార్ యాదవ్ విషయానికొస్తే మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్.2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి ఓటమి చెందారు.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.కానీ అనూహ్యంగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఆ నియోజకవర్గానికి మరో కీలక నేతను పోటీకి దింపేందుకు కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
అయితే చిన్న వయసులోనే అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపడం ఏంటి అనే ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి.ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యత్వం పై ఆశలు పెట్టుకున్న వీహెచ్ ఈ ఎంపికపై తీవ్ర అసంతృప్తితో ఉండడంతో ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏంటనేది తేలాల్సి ఉంది.







