సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం.మన చుట్టూ అందాలే ఉంటాయి.
అందే వారికి ఆ అందం ఎంతో ఆనందం.కానీ కొంత మందికి అది ఏవగింపు కలిగిస్తుంది.
ఈ రోజు గుండె పోటుతో కన్ను మూసిన చలపతి రావు సైతం జీవితం అంతా ఆడవారికి దూరంగా ఉన్నారు.పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అగ్ని ప్రమాదం లో తన భార్య మరణిస్తే మరో పెళ్లి చేసుకొమ్మని ఎంత చెప్పినా నేను ఇక పత్ని వ్రతుడిని అంటూ మాట దటేసేవారు.
సినిమా పరిశ్రమలో మరో పెళ్లి చేసుకోవడం అసలు పెద్ద విషయం ఏమీ కాదు.పెళ్లి కాకపోయినా కలిసి ఉండేవారికి కూడా కొదవ ఏమి లేదు.
కానీ చలపతి బాబాయ్ ఆ ఒక్క తప్పు ఏనాడు చేయలేదు.
అందుకు కారణం లేకపోలేదు.
తనకు ఇండస్ట్రీ ఆడవారి పై మంచి అభిప్రాయం లేదు.అక్కడ జరిగే దారుణాలు తన కల్లతో చూసిన ఎక్కడ ఏనాడు తప్పు మాట మాట్లాడలేదు.
ఎవరు ఎలా జీవిస్తే తనకెంటి అనుకున్నాడేమో కానీ ఆడవారిని దగ్గరకు రానివ్వలేదు.అందుకు ఎక్కడో ఆడవారి పై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు.
ఆ మధ్య ఏదో ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా ఆడ వారు కేవలం పక్కలోకి మాత్రమే పనికి వస్తారు అంటూ ఒక చీప్ వ్యాఖ్య చేసి అడ్డంగా బుక్ అయ్యాడు.అయితే ఇండస్ట్రీ లో అంత ఇదే విధంగా ఉంటారు.

కానీ బయట పడరు.కానీ లోపల ఎలాంటి కల్మషం లేని వ్యక్తి కాబట్టి తొందర పడి అనేశాడు.ఈ వ్యాఖ్యలతో ఇండస్ట్రీ, మహిళ సంఘాలు అట్టుడికి పోయాయి.అయితే షూటింగ్ లొకేషన్ లో కూడా ఎప్పుడు ఆడవారిపై ఏదో ఒక కామెంట్ సరదాగా చేసే చలపతి రావు ఇలా ఒక్కసారిగా అందరు వ్యతిరేకించడం తో క్షమాపణ చెప్పాడు.
ఇప్పుడు ఇది అప్రస్తుతం కానీ చలపతి రావు జీవితంలో ఇదొక మాయని మచ్చ గా మిగిలిపోయింది.జీవితం అంతా నటన, షూటింగ్ అంటూ గడిపిన చలపాయ్ బాబాయ్ గత ఏడాది వరకు నటించాడు.







