బి గోపాల్ ఎందుకు యంగ్ హీరోస్ కి హిట్స్ ఇవ్వలేకపోయాడు అంటే..?

బాలయ్య, చిరంజీవి లాంటి స్టార్ హీరోలకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బి గోపాల్( B Gopal ) యంగ్ హీరోలు అయినా ప్రభాస్, ఎన్టీయార్, మహేష్ బాబు లాంటి హీరోలకి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు.

ఎందుకు అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలయ్య తో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహ రెడ్డి, నరసింహ నాయుడు లాంటి సూపర్ హిట్స్ తీసిన ఆయన చిరంజీవి తో ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తీసాడు ఇలా వరుసగా సీనియర్ హీరోలకి హిట్స్ ఇచ్చిన ఆయన యంగ్ హీరోలకి వచ్చేసరికి అసలు హిట్ ఇవ్వడం లో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.ఇంతకీ ఆయన ఎవరితో ఏ సినిమాలు చేసారో ఒకసారి చూద్దాం.

మహేష్ బాబు తో( Mahesh babu ) వంశీ అనే సినిమా చేసారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.అలాగే ఎన్టీయార్ తో( NTR ) అల్లరి రాముడు,నరసింహుడు అనే రెండు సినిమాలు చేసాడు.

ఈ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.

Advertisement

ఇక ప్రభాస్ తో అడవి రాముడు( Prabhas ) అనే సినిమా చేసాడు.ఈ సినిమా కూడా ప్లాప్ అయింది అయితే సీనియర్లకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి గోపాల్ యంగ్ హీరోల విషయంలో ఎందుకు లెక్క తప్పాడు అనే విషయంలోకి వెళ్తే ఆయన సీనియర్ హీరోల మాదిరిగానే యంగ్ హీరోలకి ఎలివేషన్స్ ఇస్తూ తీయాలి అనుకున్నప్పటికీ ఆయన ఎంచుకున్న కథలన్నీ అప్పటికి అవుట్ డేటెడ్ అవ్వడమే ఆయన సినిమాలకి చాలా పెద్ద మైనస్ అయింది.

ప్రస్తుతం బి గోపాల్ సినిమాలేం లేక ఖాళీ గానే ఉంటున్నారు.గోపీచంద్ తో ఆయన చేసిన ఆరడుగుల బుల్లెట్ సినిమానే ఆయన డైరెక్షన్ లో వచ్చిన చివరి సినిమా ఇప్పుడు బాలయ్య తో మళ్లీ ఇంకో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నప్పటికీ అది వర్క్ అవుట్ అవ్వడం లేదు అనే విషయం మనకు అర్థం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు