ఈ పల్లవితో పాపులర్ తెలుగు సినిమా పాట ఉందనే సంగతి తెలుసు.ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితి ఈ విధంగానే ఉంది.
దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై, కొందరు చేస్తున్న కామెంట్ల మీద ఆయన తన అభిప్రాయాలు చెప్పకుండా లేదా ఖండించకుండా మౌనంగా ఉండిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.కొందరు ప్రముఖులను, అభ్యుదయవాదులను హత్య చేసినా ప్రధాని ఏమీ మాట్లాడటం లేదని ప్రతిపక్ష నాయకులు, మేధావులు ఆగ్రహిస్తున్నారు.
ఇది అవాస్తవం కాదు.ఒకప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసిహారావు మౌనంగా ఉండేవారు.
ఈ విషయంలో ఆయనను చాలామంది విమర్శించేవారు.ఇప్పుడు మోడీ కూడా అలాగే ఉన్నారు.
మోడీ మౌనం వీడాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో డిమాండ్ చేసారు.ఏ విషయంలో? రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ఆరెస్సస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.గుజరాత్లో పటేల్ సామాజిక వర్గం వారు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో రిజర్వేషన్ల విధానం సమీక్షించాలని భగవత్ అన్నారు.దీనిపై మోడీ స్పందించలేదు.బీహార్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో రిజర్వేషన్లపై మాట్లాడితే కొంపలు మునుగుతాయి.
అందుకే మోడీ మౌనంగా ఉన్నారు.కానీ లాలూ ప్రసాద్ మోడీతో ఏదో ఒకటి చెప్పించి కమిట్ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం చెప్పండి.ఆయన అన్నదానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చెప్పండి … అని లాలూ రెట్టించి అడుగుతున్నారు.కానీ మోడీ ఏం చెబుతారు? ఆరెస్సస్ ఆయన మాత్రు సంస్థ.దాని అధినేత చేసిన వ్యాఖ్యలపై ఈయన అభిప్రాయం చెప్పడానికి సాహసించరు.
అందుకే మౌనంగా ఉన్నారు.ఇదిలా ఉంటే అభిప్రాయాలు చెప్పాల్సిన విషయాల్లోనూ చెప్పడం లేదు.
పార్టీ ఎంపీలు కొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా వారిని నియంత్రించలేక పోతున్నారు.