మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) ఇటీవల వైసిపికి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తరువాత తాను కూడా షర్మిల( Sharmila ) వెంట నడవబోతున్నట్లు ఆర్కే ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా జగన్ , వైసిపిల పైన విమర్శలు చేశారు .అయితే అలా వెళ్ళిన ఆర్కే మళ్ళీ కొద్ది రోజుల్లోనే తిరిగి తన సొంత గూటికి చేరిపోయారు.
వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడం , మళ్లీ కాంగ్రెస్ నుంచి వైసీపీలో( YCP ) చేరడం వెనుక కారణాలు ఏమిటి అనేది అందరికీ ఆసక్తికరంగానే మారాయి.2014లో రాష్ట్రమంతా టిడిపి గాలి వీసినా మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు.రాజధాని భూముల వ్యవహారాలలో అప్పటి టిడిపి ప్రభుత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి చుక్కలు చూపించారు .2019 ఎన్నికల్లో నారా లోకేష్ పై గెలుపొందడంతో ఆర్కే పేరు మారుమోగింది.

దీంతో ఆయనకు జగన్( CM Jagan ) మంత్రి పదవి ఇస్తారని అంతా భావించినా, ఆయనకు నిరాశే మిగిలింది.ఆ తర్వాత నుంచి అధిష్టానంతో గ్యాప్ పెరిగింది.దీంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల బిల్లులు రావడంలేదనే అసహనం , నియోజకవర్గ అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయల నిధులను కేటాయించి తర్వాత మర్చిపోయారని ఆర్కే సైతం ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.వీటి కారణంగానే ఆర్కే వైసీపీ ని వీడి కాంగ్రెస్ లో చేరారు .ఆర్కే అసంతృప్తికి గురైన విషయాలలో ఆయనకు భరోసా లభించిందా లేక వైసీపీలోనే చేరాల్సిందిగా ప్రధాన అనుచరులు, బంధువులు సూచించడంతోనే ఆర్కే మనసు మార్చుకున్నారా అనేది క్లారిటీ లేదు.

ఆర్కే సోదరుడు ఎంపీ అయోధ్య రామ రెడ్డి , ఆయన బావమరిది మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వంటి నాయకులు వైసిపిలో ఉండడం తో వారి ఒత్తిడి తోనే ఆర్కే మనసు మార్చుకుని ఉంటారనే ప్రచారం జరుగుతోంది.దీనికి తోడు విజయసాయిరెడ్డి సైతం ఆర్కేతో చర్చలు జరపడం, సీటు విషయంలో ఆయనకు హామీ ఇవ్వడంతోనే ఆర్కే వెనక్కి వచ్చారట. మంగళగిరి కి బదులుగా గుంటూరు లేదా పలనాడు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆర్కే కు సీటు ఇస్తామనే హామీని ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతొంది.