బ్లేడ్‌ల‌పై అదే డిజైన్ ఎందుకు? దీని క‌థ మీకు తెలుసా?

బ్లేడ్‌ను ఏదో ఒక సమయంలో వినియోగించేవుంటారు. బ్లేడ్ మధ్యలో క‌నిపించే డిజైన్ చూసి.

ఇలా ఎందుకు ఉంద‌నే ప్రశ్న మదిలో మెదులుతుంది.దీనివెనుక‌ ఒక ప్రత్యేక అర్థం ఉంది.

ఇది 1901లో రూపొందింది.బ్లేడ్‌ను మొదటిసారిగా అదే సంవత్సరంలో త‌యారుచేశారు.

మొదటి ఉత్పత్తి సమయంలో 165 బ్లేడ్లు తయారు చేశారు.బ్లేడ్ 1901లో మార్కెట్‌లోకి వ‌చ్చింది.

Advertisement

బ్లేడ్ రూప‌క‌ల్ప‌న‌ క్రెడిట్ కింగ్ క్యాంప్ జిల్లెట్‌కు చెందుతుంది.ఇత‌ను సుప్రసిద్ధ సంస్థ జిల్లెట్ సంస్థ వ్యవస్థాపకుడు.

విలియం నికర్సన్ సహాయంతో కింగ్ క్యాంప్ సంస్థ‌ మొదటి బ్లేడ్‌ను తయారు చేసింది.దీనిని పెద్ద అచీవ్‌మెంట్‌గా చెప్పుకున్నాడు.

ఇదే సంవత్సరంలో కింగ్ క్యాంప్ దానిపై పేటెంట్ పొంది, 1904 నుండి బ్లేడ్ల‌ ఉత్పత్తిని ప్రారంభించాడు.మొదటి బ్యాచ్ ఉత్పత్తిలో 165 బ్లేడ్లు తయార‌య్యాయి.

బ్లేడ్ తయారైన కాలంలో, అది షేవింగ్ కోసం మాత్రమే ఉపయోగించేవారు.అందుకే అందులో ప్రత్యేక డిజైన్లు చేశారు.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
చిరంజీవి నెక్స్ట్ ఈ దర్శకులతోనే సినిమాలు చేయనున్నారా..?

షేవింగ్ రేజర్‌లో బిగించేలా ఈ డిజైన్ చేశారు.అందులో మూడు రంధ్రాలు ఉండడం వల్ల రేజర్ ఫిట్ అవుతుంది.

Advertisement

ఫ‌లితంగా షేవింగ్‌లో ఎలాంటి ఇబ్బంది కలగక పోవడంతో పాటు అందులో కదలిక ఏర్ప‌డ‌దు.దీని తరువాత కింగ్ జిల్లెట్ బ్లేడ్ కోసం తీర్చిదిద్దిన‌ షేవింగ్ రేజర్ పేటెంట్ కూడా తీసుకున్నారు.

జిల్లెట్ ఇప్పటికే బ్లేడ్, షేవింగ్ రేజర్‌పై పేటెంట్ పొందింది కాబట్టి జిల్లెట్ మొదట రూపొందించిన అదే డిజైన్‌ను అనుసరించి ఇతర కంపెనీలు త‌మ‌ ఉత్పత్తిని ప్రారంభించాయి.దశాబ్దాల తరువాత బ్లేడ్ డిజైన్ అలాగే ఉంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ బ్లేడ్‌లు తయార‌వుతున్నాయి.అయితే డిజైన్ అదే కొనసాగుతోంది.

కాలక్రమేణా జిల్లెట్ దాని ఉత్పత్తిలో అనేక మార్పులు చేసింది.బ్లేడ్‌లు,షేవింగ్ రేజర్‌ల ప్రీమియం ఉత్పత్తులను పరిచయం చేసింది.

ఇది ఎగువ మధ్యతరగతి ప్రజలలో బాగా ఆద‌ర‌ణ పొందింది.

తాజా వార్తలు