మలయాళం సర్వైవల్ డ్రామా “ఆడుజీవితం”( Aadu jeevitham ) లేదా “గోట్ లైఫ్” మార్చి 28న థియేటర్లలో రిలీజ్ అయింది 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చాలామందికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది.అయితే ఈ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు చాలా మంది నోరెళ్ల బెట్టేలా చేస్తున్నాయి.ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకొని చాలామంది విస్తుపోతున్నారు.
“ఆడుజీవితం” నవల ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ( Director Blessy ) తీసిన “గోట్ లైఫ్” చిత్రం, గల్ఫ్‌లో మోసపోయిన ఓ కేరళ యువకుడి కష్టాల చుట్టూ తిరుగుతుంది.సహజ ఎడారి దృశ్యాలతో నిజజీవిత అనుభవాలను ప్రేక్షకులకు చేరువ చేస్తుంది. “గోట్ లైఫ్” ( Goat Life ) (మలయాళంలో సినిమా పేరు ఆడుజీవితం) సినిమాలో పృథ్విరాజ్ నటన వేరే లెవెల్ లో ఉంది.
అందుకే చాలామంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.మలయాళ సినిమా పరిశ్రమ గతంలో చీప్ కాస్ట్‌తో సినిమాలు తీసినా, ఇప్పుడు కొత్త కథలు, ప్రయోగాలతో ముందడుగు వేస్తున్నారు.ఏఆర్ రెహమాన్ బీజీఎం, పృథ్విరాజ్ కాస్టింగ్( AR Rahman BGM, Prithviraj Casting ) ఈ చిత్రంలో హైలైట్స్.ఎడారి కష్టాలు, బాధలతో కథ నడిచినా, అమలా పాల్‌తో కొన్ని రొమాంటిక్ సీన్లను జొప్పించారు.
ఇది సినిమా ప్రేమికులకు ఓ కొత్త అనుభవం అందించిందని చెప్పుకోవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే “గోట్ లైఫ్” సినిమాను మొదట 2010లో రాజస్థాన్ ఎడారుల్లో తీయాలని ప్లాన్ చేశారు.అంటే దాదాపు పాతికేళ్ల క్రితమే ఈ మూవీ తీయాలనుకున్నారు.అనేక అడ్డంకుల తరువాత, 2018లో చివరకు షూటింగ్ ప్రారంభమైంది.
అప్పటికి కూడా కొన్ని అడ్డంకులు సినిమా యూనిట్‌ను ఇబ్బందులు పెట్టాయి.ఒక సమయంలో జోర్డాన్‌లో సినిమా టీమ్ చిక్కుకు పోయింది, అయితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో వారిని తిరిగి తీసుకురాగలిగారు.
సినిమాలో హీరో ఎదుర్కొన్న కష్టాల కంటే, దర్శకనిర్మాతలు మరింత కష్టపడ్డారు.

“గోట్ లైఫ్” సినిమా 2018 నుంచి 2024 దాకా అంటే ఆరేళ్లు షూటింగ్ తదితర వర్కులు జరుపుకొని చివరికి విడుదలైంది.సాహసం, కొత్త కథనాలకు మక్కువ ఉన్న వారికి ఇది నచ్చుతుంది.ఎడారి దృశ్యాల నుంచి హీరో తప్పించుకునే కథ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండి ఉంటే ఈ చిత్రం మరింత గొప్పగా ఉండేది.