తెలంగాణలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది.ప్రధాన ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా రెండేసి చోట్ల పోటీ చేస్తూ రాజకీయ వేడిని పెంచుతున్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా బిఆర్‌ఎస్ అధినేత తెలంగాణ సిఎం కేసిఆర్ >( CM kcr ) రెండు చోట్ల పోటీ చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.తాను ఎప్పుడు పోటీ చేసే గజ్వేల్ తో పాటు ఈసారి కామారెడ్డి నుంచి కూడా బరిలో ఉన్నారు.
అయితే ఆయన ఓటమి భయంతోన్ ఏ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

కాగా వ్యూహాత్మకంగానే కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేసినేదుకు సిద్దమయ్యారేనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ఉత్తర తెలంగాణలో బిఆర్‌ఎస్ బలం తక్కువ అందుకే కేసిఆర్ పోటీ చేయడంవల్ల మైలేజ్ పెరుగుతుందనే అభిప్రాయంతో రెండు చోట్ల పోటీ చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చూపినట్లు తెలుస్తోంది.అయితే ప్రత్యర్థి పార్టీలలోని కీలక నేతలు కూడా కేసిఆర్ నే ఫాలో అవుతుండడం గమనార్హం.
బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కూడా రెండు చోట్ల పోటీ చేయనున్నారు.ఒకటి హుజరాబాద్ కాగా.మరోచోట కేసిఆర్ కు పోటీగా గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

అయితే మొదటి నుంచి కూడా కేసిఆర్( CM kcr ) ను ఒడిస్తానని చెబుతున్నా ఈటెల( Etela Rajender ).వ్యూహాత్మకంగానే గజ్వేల్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కూడా రెండు చోట్ల పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.
మొదట ఆయన కోడంగల్ నుంచి మాత్రమే పోటీ చేయాలని భావించినప్పటికి.ప్రస్తుతం కేసిఆర్ కు పోటీగా కామారెడ్డి నుంచి కూడా ఆయన బరిలోకి దిగబోతున్నారు.ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన మూడో జాబితాలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఖమరెడ్డి నుంచి పోటీ చేయబోతున్నట్లు కన్ఫమ్ అయింది.దీంతో మూడు పార్టీల అగ్రనేతలు రెండు చోట్ల పోటీ చేస్తూ డబుల్ డోస్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
అయితే అటు ఈటెల రాజేందర్ గాని, ఇటు రేవంత్ రెడ్డి గాని.కేసిఆర్ టార్గెట్ గా బరిలోకి దిగుతుండడంతో ఎంతవరకు పోటీ ఇస్తారనేది చూడాలి.