సౌత్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్( Kamal Haasan ) ను మించిన నటుడు మరొకరు లేరు అంటూ చాలా రోజుల నుంచి చాలా రకాలు చర్చలు అయితే జరుగుతున్నాయి.అయితే కమల్ హాసన్ సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఆర్ట్ సినిమాలు చేయడం వల్ల ఆయనకు చాలా రకాల పాత్రలను పోషించే అవకాశం అయితే దక్కింది.
దానివల్ల తనలోని నట విశ్వరూపాన్ని తను చూపిస్తూ ఇండస్ట్రీలో చాలా రకాల పాత్రలు చేయగలిగే నటుడు అని చాలామంది ఆయనను కొనియాడారు.ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో తన పాత్ర హైలైట్ అవుతూ వచ్చేది.
ఇక ఇప్పుడు కమల్ హాసన్ సీనియర్ నటుడు( Senior Actor ) అయిపోయాడు.కాబట్టి ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కమల్ హాసన్ ను రిప్లేస్ చేసే నటుడు ఎవరు అంటూ చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.ఇక దీనికి చాలామంది చాలా రకాల నటుల పేర్లను చెబుతున్నారు.అందులో ముఖ్యంగా సౌత్ నుంచి చియాన్ విక్రమ్( Chiyaan Vikram ), జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి.
ఎందుకంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా మలయాళ సినిమా ఇండస్ట్రీ లో ఈ జనరేషన్ లో ఉన్న హీరోలలో టాప్ హీరోలు ఎవరు కుస్ అంత ప్రభావాన్ని చుపించట్లేదు.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) చాలా అగ్రస్థాయి నటనను కనబరిచే నటుడని తెలుస్తుంది.ఇక మిగతా నటులు కూడా మంచి నైపుణ్యాన్ని కనబరిచినప్పటికీ కమల్ హాసన్ ను బీట్ చేసేంత నటనను చూపించే సామర్థ్యం అయితే వారిలో లేదు… అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కమల్ హాసన్ ను రీప్లేస్ చేసే నటనని కనబరిచే ఒకే ఒక నటుడు ఎన్టీఆర్ అనే చెప్పాలి…ఎన్టీయార్ కి సరైన పాత్రలు రావడం లేదు కానీ వస్తె మాత్రం దుమ్ము రేపుతాడని చాలా మంది సినీ మేధావులు సైతం చెబుతున్నారు…
.