కృష్ణ కుమారి షావుకారు జానకి పేరుకే ఇద్దరు అక్క చెల్లెలు.కానీ వీరిద్దరి మధ్య ఎంత ఎడబాటు ఉందో చాలామందికి తెలియదు.
ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ కుమారి( Krishna Kumari ) గురించి అనేక సంచలన విషయాలను బయట పెట్టారు షావుకారు జానకి.( Sowcar Janaki ) అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
కృష్ణ కుమారి నా సొంత చెల్లెలు.కానీ ఆమె పెళ్లికి కూడా తను వెళ్లలేదని ఆ రోజు నాకు కుదరలేదు అంటూ చాలా సింపుల్ గా చెప్పారు జానకి.
ఎన్టీఆర్ ను( NTR ) ఆమె ఎంతగానో ప్రేమించిందని పెళ్లి చివరి నిమిషంలోకి క్యాన్సిల్ అయిందని దానికి నేనే కారణం అంటూ చాలామంది అనుకున్నారు.కానీ అది అసలు నిజం కాదు అని తెలిపారు.
వారు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే ఆపడానికి నేను మధ్యలో ఎవరిని, ఎవరి పెళ్లి అవ్వడానికి నాకు ఎలాంటి రైట్ లేదు కదా అంటూ ప్రశ్నించారు.

పెళ్లయి 13 మంది పిల్లలు ఉన్న వ్యక్తిని ప్రేమించిన నా చెల్లిని ఎన్టీఆర్ తో పెళ్లి వద్దు అని నేను ఏ రోజు చెప్పలేదు.కానీ పెళ్లయిన వాడిని చేసుకుంటే వచ్చే సమస్యల గురించి మాత్రం ఒకసారి వివరించానని తెలిపారు.ఆ విషయంలోనే తన చెల్లి ఎంతగానో హార్ట్ అయిందని, ఆ తర్వాత తనతో కొన్నాళ్లు మాట్లాడలేదని కూడా తెలిపారు.
చివరికి తనకు పెళ్లికి శుభలేఖ( Wedding Card ) పంపించింది కానీ తనకు వెళ్లడం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చారు షావుకారు జానకి. తను నాకు లేదా నేను తనకు ఏ రోజు ఏది చేయాలో చెప్పుకోలేదని, ఒకరి జీవితం గురించి ఒకరు నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు కాబట్టి కేవలం చెప్పింది వినడం మాత్రమే చేసేదాన్ని అంటూ తెలిపారు.

తన చెల్లి బెంగళూరులో ఒక బిజినెస్ మాన్ తో( Business Man ) కేవలం ఎన్టీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రేమలో పడి రెండవ పెళ్లి వాడిని చేసుకుందని, కానీ వారికి పిల్లలు కలగకపోవడంతో ఒక పాపని దత్తత చేసుకున్నారని తెలిపారు జానకి అలాగే ఆ పాపను MTR బ్రాండ్ కి సంబంధించిన కుటుంబంలోని విక్రమ్ మయ్యా అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయగా తను కూడా బెంగళూరులోనే స్థిరపడింది అంటూ తెలిపారు.ఇలా మొత్తంగా చూసుకుంటే షావుకారు జానకి తన కుటుంబం లోని ఎవరితో పెద్దగా సంబంధాలు లేవు అని మాత్రం అర్థమవుతుంది.ఎందుకంటే భర్తతో కూడా ఆమె సఖ్యం గా లేరు.చివరిగా చెల్లితో కూడా ఎలాంటి బంధాలు లేవు.