పొలంలో మనిషి కోసం బోను ఏర్పాటు చేసిన వైనం... ఎందుకంటే?

పొలంలో మనిషి కోసం బోను ఏర్పాటు చేయడం ఏమిటి… పిచ్చికాకపోతే? అని అనుకుంటున్నారా? మీరు విన్నది అక్షరాలా నిజం.ఆ వివరం తెలియాలంటే మీరు ఈ కధనం చదవాల్సిందే.

 Who Set Up A Cage For Man In The Farm , Land, Farmer, Man, Bone,viral Latest, Ne-TeluguStop.com

సాధారణంగా చిరుత పులుల సంచారం అనేది కుగ్రామాల్లో సర్వ సాధారణమైన అంశం.ఎందుకంటే సమీపంలో అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి.

ఇక్కడ కూడా అదే జరిగింది.ఆ అడవుల్లోనుండి చిరుతలు గ్రామాలకు దగ్గర్లో ఉన్న పొలాల్లోకి వస్తుంటాయి.

అయితే ఇపుడు చిరుత పులులు ఏకంగా జనసంచారాల్లోకి వస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే అందుకు అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో చిరుత పులుల్ని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు.

అలా పులుల్ని ట్రాప్ చేసేందుకు బోన్లు వంటివి తయారు చేస్తుంటారు.అయితే తాజాగా ఓ రైతు చిరుత పులి నుంచి తప్పించుకోవడానికి… తన పొలంలో తానే బోను ఏర్పాటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది.

అవును, తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు ఐరన్‌తో బోను ఏర్పాటు చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే… ఆరావళి జిల్లా భట్ కోటా గ్రామంలో ఓ రైతుకు పొలం ఉంది.ఆ పొలంలో అర్థారత్రి పూట అతడు అటవీ జంతువుల దాడి నుంచి పంటను కాపాడేందుకు కాపు కాస్తూ ఉంటాడు.అయితే మామ్మూలుగా కాదండోయ్.

రాత్రి సమయంలో తన పొలాన్ని సంరక్షిస్తున్నందున చిరుతపులి దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇనుప పంజరాన్ని నిర్మించుకున్నాడు.

Telugu Bone, Cage, Farm, Leopards, Latest-Latest News - Telugu

రాత్రి అయితే ఇంటి నుంచి బటయకు రావడానికి కూడా అక్కడి ప్రజలు గజగజ వణుకుతున్నారు.ఇలాంటి తరుణంలో అతడు చిరుతపులి నుండి పంటను కాపాడడానికి ఏకంగా తానే ఓ బోనులో పడుకొని కాపుకాస్తు ఉంటాడు.కాగా రామేశ్వర కంపా, గోఖర్వా, షాంపూర్ సర్దోయి, లాల్‌పూర్‌తో సహా 15 కి పైగా గ్రామీణ ప్రాంతాలు చిరుత భయంతో ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే… రైతు తన పొలంకు రాత్రి పూట చిరుత పులల నుంచి రక్షించుకునేందుకు సరికొత్తగా ఆలోచించి… ఇనుముతో గట్టిగా ఐరన్ బోను ఏర్పాటు చేసుకోవడం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వ్యాపించి చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube