బాలీవుడ్ లో తెరి రీమేక్ హీరో ఎవరంటే..?

ఒక భాష లో ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే చాలు మరో భాషలో దాన్ని రీమేక్ చేయాలని చూస్తారు వీలైతే రీమేక్ చేసి మంచి సక్సెస్ కూడా కొడుతారు.

అయితే ఒక సినిమా వచ్చిందంటే దాన్ని వేరే భాషలోకి రీమేక్ చేయడానికి మహా అయితే ఓ సంవత్సరం పట్టొచ్చు.

కానీ ఏడేళ్ల తర్వాత ఓ సినిమా రీమేక్‌ అవుతోంది అంటే చాలా స్పెషల్‌ అని చెప్పొచ్చు.ఒరిజినల్‌ కథలో విషయం బాగుండాలి, లేదంటే ఆ రీమేక్‌ కోసం ఇక్కడ ఎక్కవమంది వెయిట్‌ చేస్తుండాలి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో( Tollywood ) ఓ సినిమా తెరకెక్కుతోంది.అదే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌( Ustad Bhagat Singh ).ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్‌లో కూడా తెరకెక్కుతోంది.విజయ్‌ – అట్లీ( Vijay – Atlee ) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం తెరి( teri ) అందులో విజయ్‌ పోలీసు అధికారిగా అదరగొట్టాడు.

అదే సినిమా తెలుగులో ‘పోలీసోడు అనే పేరుతో థియేటర్లలో విడుదలైంది.ఆ సమయంలో టైటిల్‌తో కాస్త ఇబ్బందిపడి.వైరల్‌ కూడా అయ్యింది.

Advertisement

అయితే ఆ సినిమాకు మన దగ్గర సరైన ఫలితం రాలేదు.ఇప్పుడు అదే సినిమాను ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా తీస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఈ సినిమా రీమేక్‌ అనే విషయం మాత్రం టీమ్‌ అధికారికంగా చెప్పడం లేదు.

ఒరిజినల్ వెర్షన్ నుండి ప్లాట్‌ను తీసుకొని… వీలైనంతవరకు పోలికలు రాకుండా హరీష్ శంకర్( Harish Shankar ) ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం.అందుకే ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ఈ వివరాలు, పోలికలు అస్సలు కనిపించలేదు అని అంటున్నారు.ఇప్పుడు అదే సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్నారని సమాచారం.

అయితే అక్కడ కొత్త దర్శకుడు కాకుండా తమిళంలో చేసిన అట్లీనే ఈ సినిమా కూడా చేస్తారట.దీని కోసం బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌( Varun Dhawan ) ఓకే అయ్యారని టాక్‌.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమాను చేస్తున్నారు.ఈ సినిమా పూర్తవ్వగానే అట్లీ తమిళంలో ఓ సినిమా చేస్తారు అని అంటున్నారు.దీని తర్వాత ‘తెరి’ హిందీ రీమేక్‌ ఉంటుంది అని చెప్పొచ్చు.

Advertisement

ఇక ప్రస్తుతం నార్త్ లో ఎక్కువ గా సౌత్ సినిమాలే రీమేక్ చేస్తున్నారు అక్కడి మేకర్స్.

తాజా వార్తలు