నువ్వు నాకు నచ్చావ్ సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

త్రివిక్రమ్ రైటర్ గా విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా నువ్వూ నాకు నచ్చావ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది.

అప్పటి వరకు వెంకటేష్ కెరియర్ లోనే అంత కామెడీ ఉన్న సినిమా ఎప్పుడు చేయలేదనే చెప్పాలి.

ఈ సినిమా లో ప్రతి సీన్ ఒక ఆణిముత్యం అనే చెప్పాలి ప్రతి సీన్ లో మనం విపరీతం గా నవ్వుతూ ఉంటాం ఇప్పటికీ చాలా మందికి ఈ సినిమా ఫేవరెట్ ఫిల్మ్ అనే చెప్పాలి.

ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాలో మొదట హీరోగా తరుణ్ ని తీసుకుందాం అనే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్ కానీ అనుకోకుండా త్రివిక్రమ్ సురేష్ బాబు కి ఈ స్టోరీ చెప్పాల్సి రావడంతో త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడు ఆయనకి ఈ స్టోరీ బాగా నచ్చిందట దాంతో ఆయన మా తమ్ముడు వెంకీ ని పెట్టీ ఈ సినిమా చేద్దాం అని అన్నాడట దాంతో త్రివిక్రమ్ కూడా ఒకే అన్నడట.అలా ఈ ప్రాజెక్ట్ లోకి వెంకీ వచ్చాడు అలాగే హీరోయిన్ గా ఎవరిని తీసుకుందాం అని అనుకున్నప్పుడు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ వాళ్లకి కనిపించిందట దాంతో ఆమెని హీరోయిన్ గా పెట్టీ ఈ సినిమా తీశాడు డైరెక్టర్ విజయ భాస్కర్.

అలా తరుణ్ ఒక మంచి హిట్ సినిమాను మిస్ అయ్యాడనే చెప్పాలి అప్పటికే తరుణ్ క్రేజ్ పీక్స్ లో ఉంది ఆయనకి కనక ఈ సినిమా పడి ఉంటే అప్పుడే ఆయన స్టార్ హీరో అయ్యేవాడు.

Advertisement
వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో

తాజా వార్తలు