మొదటి దళిత నటి ఎవరో తెలుసా…? ఆమె ఇంటికి ఎవరు నిప్పు పెట్టారు…?

పీకే రోజీ.బహుషా ఇప్పటి తరానికి ఈ పేరు తెలియక పోవచ్చు.

సినీ పరిశ్రమ గురించి బాగా తెలిసిన వారికి ఈ పేరు ఎక్కడో ఒకచోట వినిపించే ఉంటుంది.

భారతీయ వెండి తెరపై కనిపించిన తొలి దళిత నటీమణి తను.మలయాళ చిత్రంలో నటించి అగ్రవర్ణాల నుంచి ఎన్నో భౌతిక దాడులకు గురయ్యారు.ఇంతకూ తను సినీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టింది? ఆమెని హీరోయిన్ చేసిన దర్శకుడు ఎవరు? ఎందుకు ఆమెపై దాడులు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం!మలయాళ సినిమా పితామహుడు జెసి డేనియల్.కేరళలో తొలి సినిమా తీసింది ఆయనే.ఈ సినిమాలో ఆయన సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్.

భారతీయ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.విగాయత్ కుమారన్ అనే తొలి మలయాళ సినిమా తీసిన ఆయన.మొదటి సారిగా భారతీయ సినిమా ఇండస్ట్రీకి దళిత నటిని పరిచయం చేసారు.ఆ నటి మరెవరో కాదు పీకే రోజీ.

ఈ సినిమా ఇప్పుడు ఎవరి దగ్గర లేదని చెప్తారు.

Who Is The First Dalit Actress And Who Burnt Her Home , Dalit Actress, Pk Rosy,
Advertisement
Who Is The First Dalit Actress And Who Burnt Her Home , Dalit Actress, Pk Rosy,

2019లో మలయాళ మూవీ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల కోసం WCC అనే సంస్థ రోజీ పేరుతో ఒక ఫిల్మ్ సొసైటీని ఓపెన్ చేసింది.అప్పుడే పీకే రోజీ గురించి ప్రపంచానికి తెలిసింది.1903లో పీకే రోజీ త్రివేండ్రంలోని నందన్ కోడ్ లో జన్మించారు.ఆమె పులయా అనే అంటరాని సామాజిక వర్గానికి చెందిన మహిళ.

ఆమె చిన్న తనంలో తండ్రి చనిపోయాడు.కూలీ పనులు చేసి బతుకు బండి లాగేది.

ఈ సామాజిక వర్గానికి చెందిన వారి వృత్తి.హస్త కళలు, బట్టల తయారీ.

రోజీకి కూడా చిత్ర కళలపై మక్కువ ఎక్కువ.కక్కరిస్సి అనే నాటకం అంటే తనకు చాలా ఇష్టం.

రిలీజ్ డేట్ చెప్పిన.. విడుదలకు నోచుకోని సినిమాలు.. లిస్ట్ ఇదే?

ఈ నాటక ప్రదర్శన లోనే డేనియల్ రోజీని చూసాడు.ఆమె నటన చూసి తన సినిమాలో సరోజిని పాత్రకు ఎంపిక చేశాడు.

Advertisement

ఈ సినిమాలో తనను అగ్ర కుల మహిళగా చూపించాడు.ఈ సినిమా 7 నవంబర్ 1928లో త్రివేండ్రం లోని కాపిటల్ థియేటర్ లో రిలీజ్ అయ్యింది.

అప్పట్లో ఈ మూవీ తీవ్ర దుమారం లేపింది.అగ్ర కులాల వ్యక్తులు సినిమా హాల్లో రభస చేశారు.

సినిమా తెరను చించి వేశారు.కొంత మంది ఆమె ఇంటిపై రాళ్లు వేశారు.

మరికొందరు ఇంటికి నిప్పు పెట్టారు.డైరెక్టర్ డేనియల్.రోజీ ఇంటికి పోలీసులను రక్షణ గా పెట్టించాడు.

రోజీ 1988లో చనిపోయిట్లు తెలుస్తోంది.ఆమె నటన అద్భుతమైనా రావాల్సిన గుర్తింపు రాలేదని నాటి సినీ జనాలు చెప్పినట్టు వ్యాఖ్యలు వినిపించాయి.

తాజా వార్తలు