ఇక ప్రస్తుతం లక్నో సూపర్ జాయింట్స్ టీం ఐపిఎల్ కోసం రెడీ అవుతుంది.ఇక ఈ టీమ్ లో ఆడే తుదిజట్టు ఏది అనేదానిమీద తీవ్రమైన చర్చలు అయితే నడుస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఈ టీమ్ లో ఆడటానికి టీమ్ యాజమాన్యం కీలకమైన ప్లేయర్లను సెలెక్ట్ చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఇప్పటికే ఈ టీమ్ కి మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్( Gautam Gambhir ) ను తీసేశారు.

ఇక దానికి తోడుగా కెప్టెన్ అయిన కే ఎల్ రాహుల్( KL Rahul ) మీద కూడా చాలా విమర్శలైతే వస్తున్నాయి.గత రెండు సీజన్లలో తను టీమ్ ని సెమీఫైనల్ కి అయితే తీసుకెళ్లాడు గానీ కప్పు కొట్టించే విధంగా ప్రయత్నాలు అయితే చేయలేదు.అయితే గత సీజన్ లో సెమీఫైనల్ లో క్వాలిఫైర్ మ్యాచ్ లో రాహుల్ అందుబాటు లేడు అయినప్పటికీ ఆ భారం మొత్తం తన మీద పడుతుంది.ఇక ఇది ఇలా ఉంటే దీంతో పాటుగా 2022 వ సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టీమ్( Gujarat Titans Team ) 2022 లో ఒకసారి కప్పు గెలిచి మరొకసారి రన్నరప్ గా నిలిచింది.
ఇక దీంతో లక్నో టీమ్( Lucknow Team ) యాజమాన్యం తమ టీమ్ ఫెయిల్ అవ్వడానికి కెప్టెన్ వైఫల్యమే కారణం అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్ గా రాహుల్ ఉంటాడు.
ఆయన కనక ప్రభావం చూపించలేకపోతే మిగితా మ్యాచ్ లకి నికోలస్ పూరాన్ కి కెప్టెన్ గా బాధ్యతలను అప్పగించాలని లక్నో టీమ్ యాజమాన్యం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి రాహుల్ ని తప్పిస్తే ఆయన ఆట తీరులో ఏదైనా ప్రభావం కనిపించవచ్చు అని టీమ్ యాజమాన్యం భావిస్తుంది.రాహుల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు.ఎందుకంటే ఆయన ప్రతి ఐపిఎల్ లో మినిమం పరుగులు చేస్తూ వస్తున్నాడు.
ఇక ఇప్పుడు కెప్టెన్ గా బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగిస్తే తను ఎలాంటి ప్రేజర్ లేకుండా తన ఫామ్ ను సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తాడు అనే ఉద్దేశ్యం లో లక్నో టీమ్ ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక పురాన్ కి కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించే విషయం మీద కూడా టీమ్ యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది…