గాడ్ ఫాదర్ నుండి స్పెషల్ వీడియో.. అసలు సత్యప్రియ జయదేవ్ ఎవరు?

టాలీవుడ్ లో దసరా సందడి మొదలయ్యింది.ఈ ఏడాది టాలీవుడ్ నుండి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ కూడా ఉంది.

 Who Is Satyapriya Jayadeva, Satyapriya Jayadeva, Megastar Chiranjeevi, God Fathe-TeluguStop.com

తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక రీమేక్ సినిమా.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర అవుతున్న ప్రొమోషన్స్ కూడా స్పీడ్ పెంచేశారు.ఇటీవలే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు.

అలాగే వరుసగా మెగాస్టార్ లుక్స్ కు సంబందించిన పోస్టర్స్ వదులుతూ మరింత ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.మెగాస్టార్ లుక్ చూసి అంతా స్టన్ అయిపోతున్నారు.

ఇక తాజాగా నయనతార కు సంబందించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించినట్టు టాక్.

ఈమె సత్యదేవ్ భార్య పాత్రలో కీలక మైన పాత్రలో నటించింది.ఆమె పాత్ర పేరు సత్య ప్రియా జయదేవ్.

ఈమె సెట్ లో మేకప్ వేసుకుంటున్న దగ్గర నుండి చిరు, సత్య దేవ్ సన్నివేశాల్లో నటించే సన్నివేశాల మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.దీంతో ఈమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది అని అర్ధం అవుతుంది.

మరి ఈ సత్యప్రియ జయదేవ్ ఎవరు? ఆమె పాత్ర ఏంటి ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇలా అందరి అటెన్షన్ ఈ సినిమాపై వచ్చేలా చేస్తూ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.దీంతో ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమాపై ఆచార్య ఎఫెక్ట్ పడకుండా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube