అతి చేస్తే ఎవరికైనా ఇదే మరి.. TV9 ఒక లెక్కేంటి ?

ఒక్కోసారి టీవీ ఛానెల్స్( TV Channels ) చేసే హడావిడి చూస్తే మాములుగా ఉండదు.మొన్న రోడ్ లో వెళ్తుంటే మోసం, దగా తో కుట్ర చేసి నుంబర్ వన్ కాలేరు అంటూ tv9 ఛానెల్( TV9 Channel ) పెట్టిన హోర్డింగ్స్ కనిపించాయి.

 అతి చేస్తే ఎవరికైనా ఇదే మరి.. Tv9-TeluguStop.com

చాల ఏళ్లుగా వార్తలను ప్రసారం చేసే ఛానెల్స్ విషయం లో సదరు ఛానెల్ మాత్రమే నంబర్ వన్ గా నడుస్తుంది.అయితే ఆ ఛానెల్ నుంచి రవి ప్రకాష్( Ravi Prakash ) ను బయటకు పంపించాక ఆ సంస్థలోని పెద్ద తలకాయల పని తీరు మరియు ఓవర్ యాక్షన్ కారణంగా ఆ నంబర్ వన్ కాస్త నంబర్ 2 అయ్యింది.

పైగా అప్పటి వరకు నంబర్ 2 గా ఉన్న NTV మొదటి స్థానానికి దూసుకుపోయింది.

ఈ దెబ్బతో ఇండస్ట్రీ మొత్తం ఛానెల్స్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి.

చాల రోజుల తర్వాత కొద్దీ పాటి తేడాతో మళ్లి మొన్న ఈ మధ్య NTV ని దాటుకొని మొదటి స్థానానికి వచ్చింది TV9.దాంతో పట్టపగ్గాలు లేనంత సంతోషం ఆ ఛానెల్ లో కనిపించింది.కేక్ కట్టింగ్ లు, పూలదండలు అంటూ తెగ హడావిడి చేసాయి.కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.అసలే ఓవర్ యాక్షన్ ఛానెల్ అని మొదటి నుంచి అతి అంటూ బాగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్న టైం లో ఈ నంబర్ వన్ కి రాగానే ఆ ఛానెల్ వ్యవహరించిన తీరు జనాలకు నచ్చలేదు.ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు.

దాంతో దెబ్బకు ఆ ఛానెల్ రేటింగ్ పడిపోయింది.

Telugu Channels Latest, Ntv, Number Channel, Number, Telugu Latest, Teluguchanne

ఈ సారి కాస్త గట్టిగానే పడిపోయింది.టీవీ9 నాలుగు పాయింట్స్ కిందకు పడిపోతే NTV ఐదు పాయింట్స్ పైకి ఎగబాకింది.ఇది కూడా ఈ రెండు ఛానెల్స్ కి శాశ్వతం కాకపోవచ్చు.

రేటింగ్ ( Rating )అనేది ఎప్పుడు మారిపోయే ప్రక్రియ.దాన్ని చూసుకొని మురిసిపోవడం సరి కాదు.

పైగా ఎన్నికల టైం దగ్గరికి వస్తున్న ఈ టైం లో చాల ఎక్కువ హడావిడి చేస్తున్నాయి అన్ని వార్తల ఛానెల్స్.ఇలాగె కాస్త అతి చేస్తే పైన ఉన్న రెండు పెద్ద ఛానెల్స్ కిందకు పడిపోయిన ఆశ్చర్య పోనక్కర్లేదు.

ఎవరికీ ఎప్పుడు టైం కలిసి వస్తుందో ఎవరు చెప్పగలరు చెప్పండి.ఒక పక్క రవి ప్రకాష్ tv9 ని ఎప్పుడైనా తొక్కడానికి అనేక రకాల వ్యూహాలు చేస్తూనే ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube