ఎవరికి ఓటు వేస్తారు ? పార్టీలకు వీరితో టెన్షనే 

ఏపీలో మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారనేది క్లారిటీ రావడం లేదు.ఒక్కో సర్వే ఒక్కో పార్టీకి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి అంటూ హడావుడి చేస్తున్నాయి.

 Who Do You Vote For? The Parties Have Tension With Them, Ap, Ap Politics, Jagan-TeluguStop.com

  దీంతో ఏ సర్వే రిపోర్టును నమ్మాలో తెలియని పరిస్థితి అందరిలోనూ నెలకొంది.ఇక టిడిపి అధినేత చంద్రబాబు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , వైసీపీ అధినేత ,ఏపీ సీఎం జగన్ పెద్ద ఎత్తున ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు ,బస్సు యాత్రలు చేపడుతున్నారు.

వీరి సభలకు భారీగా జనాలు తరలిస్తున్నారు.ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు భారీగా జన సమీకరణ పై దృష్టి సారించారు.

తమ అధినాయకుల సభలను సక్సెస్ చేసే  విధంగా జనసమీకరణ చేపడుతున్నారు.దీంతో ఎవరి సభకు చూసినా,  జనం పోటెత్తుతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Cm Ys Jagan, Jagan, Jana Sena-Politics

 అయితే ఆయా పార్టీల తరఫున సభలకు హాజరైన వారంతా, ఆ పార్టీ అయితే కచ్చితంగా ఓటు వేస్తారా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి.మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రాజకీయ వాతావరణం విభిన్నంగా ఉంటుంది.ఇక్కడ కులం, డబ్బు మాత్రమే ప్రభావం చూపిస్తాయి.కులాల వారీగా పార్టీలకు మద్దతు ప్రకటించే పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది.అయితే పోలింగ్ తేదీ వరకు ఎవరి మనసులో ఏముందనేది తేలడం లేదు.పోలింగ్ కు ముందు రోజునైనా మనసు మారే అవకాశం ఉంటుంది .కొన్ని కొన్ని కారణాలతో అప్పటికప్పుడు జనాల మూడు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది.దీంతో సైలెంట్ ఓటింగ్ పై ఆయా పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు .ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు అనేది చెప్పలేని పరిస్థితి.

Telugu Ap Cm Jagan, Ap, Cm Ys Jagan, Jagan, Jana Sena-Politics

 ఒకవైపు సంక్షేమ పథకాలను చూసి జగన్ పార్టీకి( CM ys jagan ) ఓటు వేయాలా లేదా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏదో జరుగుతుందని ఆశించి కూటమి వైపు నిలబడతారో  తేల్చుకునేందుకు జనాలకు ఇంకా సమయం ఉంది.దీంతో సైలెంట్ ఓటింగ్ పైనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.జనాల మనసులో తమ పార్టీ ముద్ర ఉండే విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube