యాంగ్రీ మ్యాన్ అంటే అప్పటికి ఇప్పటికి కేవలం రాజశేఖర్ మాత్రమే.అయన కోపం తో కన్నెర్ర చేస్తే అభిమానుల్లో కూడా ఆవేశం రగులుతుంది.
విలన్ అతడిని కొడుతుంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కూడా కళ్ళల్లో రక్తం కారుతుంది.అతడొక ఆవేశానికి కేర్ ఆఫ్ అడ్డ్రస్సు.
మీసం మెలేస్తే ప్రేక్షకుడు గుండె గర్వం తో ఉప్పొంగుతుంది.పోలీస్ డ్రెస్ లో గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్తే ప్రతి ఒక్కడు తామొక పోలీసుల మారి సినిమా చూడాల్సిందే.
అంతలా తన రౌద్రాన్ని నటనలో రంగరించి వదులుతాడు.ఇప్పుడు అంటే హీరో రాజశేఖర్ కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది కానీ ఒకప్పుడు ఆయన్ను చూస్తే నిజమైన పోలీస్ ఏమో అనిపించేది.
ఒక ఆగ్రహం, ఒక ఆహుతి, ఒక ఆవేశం , ఒక అంకుశం .ఇవన్నీ రాజశేఖర్ పోలీస్ పాత్రలో నటించి యాంగ్రీ మ్యాన్ గా తనలోని విశ్వరూపాన్ని చూపించిన సినిమాలు.మళ్లి మాకు ఆ రాజశేఖర్ కావలి.మళ్లి ఆ నాటి యాంగ్రీ మ్యాన్ పాత్రలు పడాలి.ఆ రాజశేఖర్ కోసం ఇండస్ట్రీ అంత ఎదురుచూస్తుంది.ఇండస్ట్రీ లో సరైన కథలు లేవంటే నేను అయితే నమ్మను.
రాజశేఖర్ ని నాటి రోజులో దర్శకులు వాడుకున్నట్టు ఇప్పుడు దర్శకులు వాడుకోవడం లేదు అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.ఆహుతి, అంకుశం సినిమాల కోసం జనాలు అప్పట్లో మళ్లి మళ్లి థియేటర్లకు వెళ్లేవారు.
రాజశేఖర్ లోని నటుడు ఇంకా చచ్చిపోలేదు.కానీ ఆయన్ని వాడుకునే దర్శకుల్లో ప్రతిభే కొరవడింది.
ఆఖరికి ఒక పోర్న్ స్టార్ తో పాటకు స్టెప్పులు వేయించి సినిమా విడుదల చేసుకోవాల్సిన అవసరం ఆయనకు వచ్చిందంటే అది రాజశేఖర్ తప్పు కాదు.అలాంటి ఒక రెబల్ నటుడిని వాడుకోకపోవడం ఇండస్ట్రీ తప్పు.ఇక ఆస్తులు అమ్ముకొని అయన సినిమాలు తీస్తున్న కూడా జనాలు థియేటర్ కి వెళ్తున్నారు అంటే కేవలం అది రాజశేఖర్ కోసం మాత్రమే.అయన ఇంట్లో, జీవితంలో ఎలాంటి వివాదాలు ఉన్న సగటు ప్రేక్షకుడికి మాత్రం ఆనాటి ఆ రాజశేఖర్ మాత్రం కనుమరుగయ్యాడు.
ఇప్పటికి అయినా అతడిని వాడుకునే విధంగా వాడుకొని మంచి సినిమా తీస్తే చూడాలని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.