సాయి పల్లవి( Sai pallavi ) .ఈ పేరు వింటే చాల మందికి ఒక లాంటి వైబ్రేషన్.
మహానటి సావిత్రి తో పోలుస్తూ అంతటి హీరోయిన్ అవ్వగలిగే సత్త ఉన్న హీరోయిన్ అంటూ ఉంటారు.డ్యాన్స్( Dance ) లోను, నటన లోను ఇరగదీస్తు తెలుగు వారినే కాదు సౌత్ ఇండస్ట్రీ అన్నిట్లో కూడా మంచి నటిగా పేరు తెచ్చుకొని ఆమె కోసం హీరోలు సైతం ఎదురు చూసే స్థాయికి ఎదిగిపోయింది.
ఫిదా సినిమ( Fida movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా సాయి పల్లవి వరస పెట్టి మంచి విజయాలను అందుకుంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఒక స్థాయికి వెళ్ళిపోయింది.కానీ ఉన్నట్టుండి చాల రోజులుగా ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది అనే వార్త ఎవరికీ తెలియకుండా ఉంటుంది.

సోషల్ మీడియాలో కూడా చాల తక్కువగా కనిపిస్తున్న సాయి పల్లవి సినిమాల్లో నటిస్తుందా ? లేక చాల సార్లు మీడియా ఇంటర్వూస్ లో చెప్పినట్టు తనకు సినిమాలు సరిపడవు అనుకున్నప్పుడు మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను అన్నట్టు తిరిగి తన సొంత ఇండస్ట్రీ కి వెళ్లిపోయిందా అనే అనుమలను వ్యక్తం అవుతన్నాయి.కొంత మంది అయితే ఆమె విదేశాల్లో సెటిల్ అయ్యింది అంటుంటే మరికొందరు మాత్రం ఆమె ఒక పొలిటిషన్ కొడుకు ని పెళ్లి చేసుకోబోతుంది అంటున్నారు.ఆమె సరైన వివరాలు తెలియక ఎవరికీ నచ్చింది వారు మాట్లాడుతున్నారు.సోషల్ మీడియాలో కూడా సాయి పల్లవి పై అనేక ఊహాగానాలు వస్థానం నేపథ్యం లో ఆమె తెలుగు లో చివరగా నటించిన సినిమా విరాట పర్వం( Virata parvam movie ).ఈ చిత్రం తెలుగు లో పరాజయం పాలయ్యింది.

ఇక తమిళ్ లో గార్గి సినిమా కూడా దాదాపు డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.దాంతో ఒక అడుగు వెనక్కి వేసి కాస్త ఆచి తూచి సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్న సాయి పల్లవి అప్పుడప్పుడే తెలుగు లో ఏ సినిమా ఒప్పుకునేలా లేదు.కానీ ఎవరు ఊహించని విధంగా తమిళ్ లో హీరో శివ కార్తికేయన్ తో ఒక సినిమా కు సైన్ చేసింది.
ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఏది ఏమైనా సాయి పల్లవి ని తెలుగు వారు చాల మిస్ చేస్తన్నారు.
త్వరలోనే తెలుగు లో కూడా ఒక సినిమా చేస్తే బాగుండు అనుకుంటున్నారు.