ఆ హీరో నో చెప్పడం బాధించింది.. వైరల్ అవుతున్న గౌతమ్ మీనన్ కామెంట్స్!

గౌతమ్ మీనన్( Gautham Menon ) దర్శకత్వంలో విక్రమ్( Vikram ) హీరోగా నటించిన చిత్రం దృవ నక్షత్రం.

దాదాపుగా ఏడేళ్ల క్రితం సిద్ధమైన ఈ సినిమా అనేక కారణాలవల్ల వాయిదా పడుతూనే వస్తోంది.

ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.ధృవ నక్షత్రం( Dhruva Natchathiram ) కథను తొలుత వేరే హీరోలకు చెప్పాను.

అనివార్య కారణాల వల్ల వారు దానిని రిజెక్ట్‌ చేశారు.వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాను.

Advertisement

అందువల్ల వాళ్లు రిజెక్ట్‌ చేసినందుకు నేనేమీ బాధపడలేదు.కానీ ఈ కథకు సూర్య( Suriya ) నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయాను.

అది నన్నెంతో బాధించింది అని ఆయన తెలిపారు.ధృవ నక్షత్రం విడుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నా.తప్పకుండా దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము.

ఎన్నో ఏళ్ల క్రితం దీనిని తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం బోర్‌ ఫీల్‌ కారు.దీనిని పాత కథ అనుకోరు.

నేటి తరం ప్రేక్షకులకు తప్పకుండా ఇది నచ్చుతుందని నమ్ముతున్నాను.ఇటీవల విడుదలై విజయాన్ని అందుకున్న మద గజ రాజ( Madha Gaja Raja ) సుమారు 12 ఏళ్ల క్రితం తెరకెక్కించారు.

గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?
న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదు.. మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

ఆ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్‌ అందుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది.ఆ సినిమా మాదిరిగానే మా సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను అని గౌతమ్‌ మేనన్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమే ధ్రువ నక్షత్రం ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు.

దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ అసహనం వ్యక్తం చేశారు.ఇది వాయిదా పడడం బాధను మిగుల్చుతుందని అన్నారు.ఇది చాలా హృదయవిదారకంగా ఉంది.

చిత్రం వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు.నా కుటుంబం ఆందోళన చెందుతోంది.

నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది.కానీ, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని ఉంటున్నా అని ఒక సందర్భంలో కూడా తెలిపారు.

తాజా వార్తలు