ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది.. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.

ఈ ఏకాదశి పండుగనే ముక్కోటి ఏకాదశి అని, పుత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున శ్రీహరికి కఠిన ఉపవాసాలతో పూజలు చేసి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు.ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని భావిస్తారు.

ఇలా ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేసే సమయంలో తప్పనిసరిగా ఉపవాస కథను చదవాలి.హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి 2022 జనవరి 12వ తేదీ బుధవారం వచ్చింది.అయితే ఏకాదశి ఏకాదశి తిథి 12వ తేదీ సాయంత్రం4:49 కి ప్రారంభమై మరుసటిరోజు అంటే 13 వ తేదీ సాయంత్రం7:32 వరకు ఏకాదశి తిథి ఉంటుంది.ఈ క్రమంలోనే చాలామంది 12వ తేదీ సాయంత్రం నుంచి ఉపవాసం ఉండి స్వామి వారిని పూజిస్తారు.

Advertisement
When Did Vaikhunta Ekadasi Came And What Is Its Significance Details, Vaikuntha

ఇక ఈ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనార్థం ఆలయాలకు చేరుకుంటారు.అయితే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీహరి ఆలయాలలో ఉత్తర దిశ దర్శన భాగ్యం కల్పిస్తారు.

ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల మరణాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు.

When Did Vaikhunta Ekadasi Came And What Is Its Significance Details, Vaikuntha

ఈ క్రమంలోనే భక్తులు ఉదయమే నిద్రలేచి శ్రీహరిని పూజించిన అనంతరం ఆలయాలకు వెళ్లి స్వామివారి దర్శన భాగ్యం అనంతరం తీర్థ ప్రసాదాలను తీసుకుంటారు.అయితే ఈ వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ క్రమంలోనే ఎవరైతే పుత్ర సంతానం కావాలని భావిస్తారో అలాంటి వారు వైకుంఠ ఏకాదశి రోజు పుత్ర సంతాన వ్రతం చేయటం వల్ల వారికి పుత్ర సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఈ వ్రతం చేసుకోవడానికి 13వ తేదీ మధ్యాహ్నం వరకు ఎంతో అనువైన సమయం అని చెప్పవచ్చు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు