వాట్సాప్ గ్రూప్స్ అడ్మిన్స్! ఈ ఫీచర్‌ల బెనిఫిట్స్‌ గురించి మీకు తెలిసిందా?

వాట్సాప్‌( Whatsapp ) వరుస అప్‌డేట్‌లతో వినియోగదారులకు ఉక్కిరిబిక్కిరి లేకుండా చేస్తోంది.వినియోగదారుల సౌకర్యార్ధం అన్ని విభాగాలను మెరుగుపరుచుకుంటూ వస్తోంది.

 Whatsapp Groups Admins Are You Aware Of The Benefits Of These Features ,whatsapp-TeluguStop.com

ఈ క్రమంలో అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్‌లను అందిస్తోంది.ఇప్పుడు గ్రూప్ అడ్మిన్లు, సాధారణ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లను( WhatsApp new features ) ప్రకటించడం విశేషం.

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ద్వారా ఈ అప్‌డేట్‌ను షేర్‌ చేయడం గమనార్హం.మెసేజింగ్ యాప్‌లో గ్రూప్‌లు ముఖ్యమైన భాగమని, ఈ కొత్త ఫీచర్‌ల ద్వారా వాట్సాప్ గ్రూప్‌లను నిర్వహించే అడ్మిన్‌లకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపింది.

Telugu Fintech, Admins, App, Whatsapp-Latest News - Telugu

ఇందులో మొదటగా గ్రూప్‌ల అడ్మిన్‌లకు ప్రైవసీ కోసం మెరుగైన కంట్రోల్స్‌ను అందిస్తోంది.దాని కోసం మెసేజింగ్ యాప్‌( messaging app )లోకి ఎవరు జాయిన్‌ అవ్వచ్చు, ఎవరు జాయిన్‌ అవ్వకూడదు అనే అంశాన్ని నిర్ణయించడానికి ఓ సరి కొత్త టూల్‌ను యాడ్‌ చేయనుంది.అదేవిధంగా వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేయగల సభ్యుల సంఖ్యను కంపెనీ తాజాగా రెట్టింపు చేసింది.ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూప్‌లో 512 మంది వరకు సభ్యులను చేర్చవచ్చు.అయితే ఇప్పుడు మెసేజింగ్ యాప్ 1024 మంది సభ్యులకు సపోర్ట్‌ చేస్తుండడం విశేషం.గతేడాదే ఈ ఫీచర్‌ గురించి వాట్సాప్‌ ప్రకటించినా.

ఇప్పుడు దానిని అందుబాటులోకి తీసుకొస్తోంది.

Telugu Fintech, Admins, App, Whatsapp-Latest News - Telugu

ఆ తరువాత చెప్పుకోదగ్గది పిన్నింగ్‌ మెసేజెస్‌.వాట్సాప్ ఇప్పుడు చాట్‌లు, గ్రూప్‌లలోని మెసేజ్‌లను పిన్ చేసే ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది.దీని ద్వారా వినియోగదారులు ముఖ్యమైన మెసేజ్‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వగలరు.

వాబీటాఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉంది.ఈ ఫీచర్ పూర్తిగా డెవలప్ అయిన తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఇకపోతే వాట్సాప్‌లోని గ్రూప్‌లు గత కొన్ని నెలలుగా చాలా ఫీచర్‌లను అందుకున్నాయి.గ్రూప్‌ సపోర్ట్ చేసే సభ్యుల సంఖ్య పెరిగింది.

అదే విధంగా ఇతర సభ్యులు గ్రూప్‌లో చేసిన మెసేజ్‌లను అడ్మిన్‌లు తొలగించే సదుపాయం కూడా ఇప్పుడు కలదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube