వాట్సాప్‌ అకౌంట్ బ్యాన్ అయిందా..? రీస్టోర్ చేయండిలా!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వాట్సాప్ మెసేజింగ్ అప్లికేషన్ ను ప్రతిరోజూ వాడుతున్నారు.ఒక్కరోజు వాట్సాప్ సేవలు నిలిచిపోయినా.

వీరికి రోజు గడవదు అంటే అతిశయోక్తి.ఆ స్థాయిలో ప్రజల జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్ బ్యాన్ అయితే.

ఇబ్బంది పడక తప్పదు.యూజర్లు నకిలీ వాట్సాప్ అప్లికేషన్లను వాడటం వల్ల వాట్సాప్ బ్యాన్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లను వాట్సాప్‌ ప్లస్‌ (WhatsApp Plus), జీబీ వాట్సాప్‌ (GB WhatsApp) వంటి అప్లికేషన్లు ఆఫర్ చేస్తున్నాయని చాలామంది వాటిని ఉపయోగిస్తుంటారు.కానీ ఒరిజినల్ వాట్సాప్ అందించినట్లు ఈ అప్లికేషన్లు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ప్రైవసీని అందించవు.

Advertisement
WhatsApp Account Banned? Restore! What's Up , Account, Banned, Latest News, Tec

అందువల్ల యూజర్ల డేటా హ్యాకర్ల చేతిలో పడి ప్రమాదాలు లేకపోలేదు.అందుకే వాట్సాప్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది.

నకిలీ యాప్స్ వాట్సాప్ అకౌంట్ వాడే వారిని బ్యాన్ చేస్తుంటుంది.ఒకవేళ మీరు కూడా పొరపాటున ఇతర వాట్సాప్ యాప్ వినియోగించి బ్యాన్ కు గురైనట్లయితే కంగారు పడాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే ఒక సింపుల్ ట్రిక్ ద్వారా మీ వాట్సాప్ అకౌంటును మళ్లీ పునరుద్ధరించవచ్చు.అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Whatsapp Account Banned Restore Whats Up , Account, Banned, Latest News, Tec

మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిన తర్వాత మీరు వాడుతున్న నకిలీ వాట్సాప్‌లో సెట్టింగ్స్‌ హెల్ప్ యాప్‌ ఇన్ఫో ఆప్షన్ పైనొక్కండి.తర్వాత పర్మినెంట్ బ్యాన్ కాకుండా తాత్కాలిక నిషేధిత సమయం ముగిసే లోపు చాట్ బ్యాకప్ చాట్‌పై క్లిక్ చెయ్యండి.చాట్ బ్యాకప్ ప్రక్రియ ముగిశాక ఫోన్‌ సెట్టింగ్స్‌ స్టోరేజ్‌ ఫైల్స్‌పై క్లిక్ చేయండి.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

మీ ఫైల్స్ లో జీబీ వాట్సాప్‌ లేదా వాట్సాప్ ప్లస్ అనే ఫోల్డర్‌ కోసం వెతికి దానిపై క్లిక్ చేయండి.ఆ ఫోల్డర్‌ పేరును వాట్సాప్‌గా మార్చండి.

Advertisement

తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి అసలైన వాట్సాప్ యాప్ డౌన్‌లోడ్ చెయ్యండి.ఆ తర్వాత మీరు మీ వాట్సాప్ నంబర్ నమోదు చేసి వెరిఫై చేయండి.

ఇలా చేయడం ద్వారా పర్మినెంట్ గా మీ ఖాతా బ్యాన్ కాకుండా పునరుద్ధరించవచ్చు.

తాజా వార్తలు