మరికొన్ని సరికొత్త ఫీచర్లతో వాట్సాప్..!

ముందుగా మీకు ఒక సామెత గురించి చెప్పాలి.అదేంటంటే పాత ఒక రోత, కొత్త ఒక వింత.

అని మన పెద్దవాళ్ళు ఉరికనే అనలేదు.ఆ సామెత ప్రకారమే మన టెక్నాలజీ కూడా రోజురోజుకు అభివృద్ధి చెందుతూనే వస్తుంది.

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో, కొత్త అప్డేట్స్ తో మనల్ని బోర్ ఫీల్ అవ్వకుండా చేసే మేసెజింగ్ యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి అని చెప్పాలి.తన యూజర్స్ కి బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లను మన ముందుకు తీసుకొస్తూ అప్డేటెడ్ గా ఉంటుంది వాట్సప్.

ఈ క్రమంలోనే మరొక సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ మనముందుకు తీసుకుని వచ్చింది.ఈ ఫీచర్ ఎప్పుడో 2017లోనే మనకు అందుబాటులోఉంది కానీ.

Advertisement
Whats Up, New Feature, Latest News, Techonolgy Updates, Deledted Mesages-మర�

దానిని మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేసారు.మీ అందరికి వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్‌ గురించి తెలిసే ఉంటుంది.

ఇప్పుడు ఆ ఫీచర్ ను మరింత అడ్వాన్స్ చేసింది వాట్సాప్.మనం ఎవరికన్నా ఒక మెసేజ్ పంపించినప్పుడు దానిని కొన్ని కారణల వలన డిలీట్ చేయాలనుకుంటే ఇద్దరి మొబైల్స్ లోనూ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్ ఉపయోగించి ఒకేసారి తీసేయొచ్చు.

అయితే ఈ ఫీచర్ కొద్ది నిమిషాల పాటే ఉండేది.కానీ ఈ ఫీచర్ యొక్క కాలపరిమితిని మళ్ళీ ఇక గంట 8 నిమిషాలకు పెంచారు.

Whats Up, New Feature, Latest News, Techonolgy Updates, Deledted Mesages

ఇప్పుడు అంతకుమించిన సమయం కోసం వాట్సాప్ ను రెడీ చేసే పనిలో పడ్డారు నిర్వాహకులు.ఒకవేళ ఈ ఫీచర్ మనకు అందుబాటులోకి వస్తే మనం సెండ్ చేసిన మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట.అంటే మెసేజ్ చేసిన మూడు నెలల తర్వాత కూడా డిలీట్ చేయొచ్చు.కాగా వాట్సాప్ ఆండ్రాయిడ్ కొత్త బీటా వెర్షన్ 2.21.23.1లో ఈ టైమ్ లిమిట్ ఎక్స్‌టెన్షన్‌ కు సంబంధించిన అప్డేట్ కనిపించింది.ఇంకా డెవలప్‌మెంట్‌ లోనే ఉన్న ఈ ఫీచర్‌ ను అందుబాటులోకి వస్తుందా.? లేదా అనే విషయం పట్ల వాట్సాప్ ఇంకా అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకటించలేదు.ప్రస్తుతానికి టెస్టింగ్ దశలోనే ఈ ఫీచర్ ఉంది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు