రెజీనాతో మెగాహీరో ప్రేమాయణం....

రేయ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల‌నుకున్నప్ప‌టికీ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో పిల్లానువ్వులేని జీవితం సినిమాతో తెరంగేట్రం చేశాడు.విడుద‌లైన తొలి చిత్రంతోనే స‌క్సెస్ అందుకున్న సాయిధ‌ర‌మ్ రేయ్‌తో డ్యాన్సులు ప‌రంగా మంచి మార్కుల‌నే కొట్టేశాడు.

 What’s Cooking Between Sai Dharam And Regina?-TeluguStop.com

మూడో చిత్రంగా సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రంతో కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కొట్టాడు.ఇప్పుడు అనిల్ రావివూడితో సుప్రీమ్ సినిమా చేస్తున్నాడు.

ఇక్క‌డ చెప్పుకోవాల్సిన విష‌య‌మేమంటే తొలి మూడు చిత్రాల్లో రెండు సినిమాలు రెజీనాతో క‌లిసి న‌టించాడు.

తాజాగా సాయిద‌ర‌మ్‌తేజ్‌, రెజీనాల మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ సాగుతుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు రాని రూమ‌ర్ ఇప్పుడే రావ‌డానికి కార‌ణం ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ షూటింగ్ స్పాట్‌కు రెజీనా త‌రుచుగా వెళుతుంద‌ట‌.ఇది చూసిన‌వారు వీరి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని అనుకుంటున్నారు.

అయితే వీరిదేది ప‌ట్ట‌న్న‌ట్లుగా ఉన్నారు.అయితే దీనిపై మెగాక్యాంప్ నుండి ఎటువంటి సమాధానాలు రాలేదు.

కెరీర్ స్టార్టింగ్ లో ఇలాంటి రూమర్స్ రాకుండా చూడమని సాయిధరమ్ కు ఎవరు సలహా ఇస్తారో చూడాలి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube