సొంత పార్టీ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నారు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) .వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 175 స్థానాల పైన ఫోకస్ పెట్టిన జగన్ ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
సర్వే నివేదికల ఆధారంగా నియోజకవర్గ ఇన్చార్జీల నియామకాలకు శ్రీకారం చుట్టారు.ఇప్పటికే కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జీలను మార్చగా , ఇంకా అనేకమంది స్థానాల్లో మార్పు చేర్పులు శ్రీకారం చుట్టారు.
దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు , నియోజకవర్గ ఇన్చార్జిల్లోనూ టెన్షన్ పెరిగిపోతుంది.జగన్ ఎప్పుడు ఏ వార్త చెబుతారో తెలీక టెన్షన్ పడిపోతున్నారు.
తాజాగా వైసిపి ఎమ్మెల్యేలు( YCP MLAs ) జగన్ తో విడివిడిగా భేటీ అవుతున్నారు.ఇప్పటికే అనేకమంది ఎమ్మెల్యేలు జగన్ తో భేటీ అయ్యారు .సీఎం క్యాంప్ ఆఫీస్( CM Camp Office ) నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తూ ఉండడంతో.ఏ వార్త చెప్పేందుకు పిలుస్తున్నారో అని టెన్షన్ కు గురవుతున్నారు.
జగన్ తో భేటీ అయిన సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిస్థితులు , పార్టీ బలం , సర్వే నివేదికలను ముందు పెట్టి , వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదని , అందుకే మీ స్థానంలో మరొకరిని ఇన్చార్జిగా నియమిస్తున్నామని జగన్ నేరుగానే చెప్పేస్తున్నారట . మరి కొంతమందికి వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తామని, అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జగన్ తో భేటీ అయిన వారిలో ఆయనకు అత్యంత సన్నిహితులు, కీలక నేతలుగా ఉన్న వారికి అదే విషయాన్ని చెబుతున్నారట.జగన్ తో ఇంకా భేటీ కాని వారిలో మరింతగా టెన్షన్ పెరిగిపోతుంది.
ఇప్పటికే పలు ఎమ్మెల్యేలు ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారు.తమ నియోజకవర్గాల్లో వేరే వారిని పోటీకి దించుతున్నారనే ప్రచారం జరుగుతుండడంతో, ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.జగన్ కలిసి సీటుపై గ్యారెంటీ తీసుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలుపెట్టారు .మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, గెలుపే లక్ష్యంగా జగన్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంతో, తమ సీటు కు గ్యారెంటీ ఉంటుందో లేదో తేలిక సతమతం అవుతున్నారు.