కాశీకి వెళ్తే వదిలేయాల్సింది కాయో పండో కాదు!

కాశీకి వెళ్తే కాయో, పండో వదిలేయాలని పెద్దలు చెబుతుంటారు.అందులో అసలు మర్మమేంటో తెలుసా? వాస్తవానికి కాశీలో కాయో, పండో వదిలేయాలని ఏ శాస్త్రము చెప్పలేదు.

శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసీ తెలియని పరిజ్ఞానంతో అలా మార్చేశారు.

ఇంతకీ శాస్త్రం ఏం చెప్పిందంటే.కాశీక్షేత్రం వెళ్లి గంగలో స్నానం చేసిన వారు కాయాపేక్ష, ఫలాపేక్షను గంగలోనే వదిలి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాలని అంతరార్థం.

What Should Leave Who Went To Kashi , Devotional, Devotional Telugu , Kashi, Kas

ఇక్కడ కాయాపేక్ష, ఫలాపేక్ష అంటే.కాయం అంటే శరీరం.

శరీరంపై ఆపేక్షని.ఫలం అంటే కర్మఫలం.

Advertisement

కర్మఫలముపై ఆపేక్షని పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో ఈశ్వర చింతన కలిగి ఉండాలని అర్థం.కానీ కాలక్రమేణా అది కాయ, పండుగా మారిపోయింది.

 అందుకే అక్కడకు వెళ్లిన వారంతా ఏ కాయనో, పండునో వదిలేసి వస్తున్నారు.కాశీ గయలో కూడా పురోహితులు డబ్బులు తీసుకొని ఓ కాయనో, పండునో వదిలేయించి చేతులు దులుపుకుంటున్నారు.

 ఇష్టమైన పదార్థాలను వదిలేస్తే.మనకు పుణ్యం రాదు.

శాస్త్రం ఏం చెబుతుందో పూర్తిగా అర్థం చేసుకొని.దాన్ని పాటించాలని కానీ ఎవరో ఏదో చెప్పారని చేయకూడదు.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

మన జీవిత చరమాంకంలో బంధాలు, రాగ ద్వేషాలు, తోటి వారితో వివాదాలు వదిలి పెట్టాలి.కాశీయాత్ర చేయడం వెనకున్న అసలు పరమార్థం ఇదే. మనసులో ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా నిశ్చలమైన ఆలోచనలతో ఆ దైవాన్ని ప్రార్థించాలి.ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తే.

Advertisement

ఆ దేవుడే మన కష్టకాలంలో ఆపధ్బాందవుడై వస్తాడు.

తాజా వార్తలు