కేజీఎఫ్ హీరో యష్ నెక్స్ట్ స్టెప్ ఏంటి.. ఏ దర్శకుడితో సినిమా?

కన్నడ స్టార్ హీరో యష్ గురించి మనందరికీ తెలిసిందే.కేజిఎఫ్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యష్.

 What Next For Yash After Kgf , Kgf Movie, Hero Yash, Kannada Hero, Pan Indian Mo-TeluguStop.com

కేజిఎఫ్ 1, కేజీఎఫ్ 2 ఈ రెండు సినిమాలు యష్ కెరీర్ ను ఒక్కసారిగా మార్చేశాయి.కన్నడ సినిమా ఇండస్ట్రీలో కేజిఎఫ్ సినిమా ముందు సాధారణ హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది ఈ సినిమా.

కేజిఎఫ్ సినిమాలతో చిరు యష్ కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ దక్కింది.ఇక 2018లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 కేవలం 250 కోట్లు మాత్రమే వసూలు చేయగా ఇటీవల విడుదల అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది.

బాలీవుడ్ లో అయితే ఏకంగా 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అక్కడి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.ఊహించని పరిణామాలకు హీరో యష్ తో పాటు ఆయన అభిమానులు పట్టరాని ఆనందంతో ఉన్నారు.

ఇకపోతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్బంగా ఆనంద క్షణాలని సెలబ్రేట్ చేసుకుంటున్నారట హీరో యష్.ఊహించని విధంగా స్టార్ డమ్ సొంతం కావడంతో యష్ ఈ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారట.ఒకే ఒక్క మూవీతో దేశ వ్యాప్తంగా క్రేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకోవడంతో యష్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట.

Telugu Yash, Kannada, Kgf, Pan India, Pan Indian-Movie

ఇకపోతే ఇదిలా వుంటే ఈ సినిమా హిట్ అయిన తరువాత యష్ నెక్స్ట్ సినిమా ఏంటీ? అన్నది ఇప్పడు ప్రధాన చర్చగా మారింది.తరువాత యస్ ఏ సినిమా చేయబోతున్నాడు?ఎవరితో చేయబోతున్నాడు? ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? అన్న విషయాలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.అయితే యష్ మాత్రం చాలా సింపుల్ గా మళ్లీ తను కన్నడ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని క్లారిటీ ఇచ్చేశాడు.

మరి యష్ నటించబోయే సినిమా గురించి తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube