వీరిపై వేటు తప్పదా ? మంత్రివర్గ ప్రక్షాళనకు జగన్ నిర్ణయం ?

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగానే కటినమైన నిర్ణయాలు తీసుకుంటూ… పార్టీని ప్రభుత్వాన్ని గాడి లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసిపిలో ఎక్కడకక్కడ గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడంతో, వాటిని చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.

 What Is Wrong With Them Jagans Decision To Purge The Cabinet ,jagan,ap Cabinet,-TeluguStop.com

అంతేకాకుండా ప్రస్తుత మంత్రి వర్గంలో కొంతమంది మంత్రులు తీరు కారణంగా ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉండడం, ప్రజల్లోనూ వారిపై వ్యతిరేకత కనిపిస్తు ఉండడం తదితర కారణాలతో జగన్ కొంతమంది మంత్రులపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి మరికొంతమందిని తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రస్తుత మంత్రివర్గంలో ఐదుగురిని తప్పించబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కొత్త ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది.

ఎన్నికల తరువాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారట.కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలలో కొంతమందికి మంత్రులుగా జగన్ అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం.

Telugu Ap, Ap Cm Jagan, Ap Ministers, Jagan, Ysrcp, Ysrcp Mlas, Ysrtp-Politics

ఈ మంత్రి వర్గ ప్రక్షాళనలోనూ సామాజిక వర్గాల సమతూకం జగన్ పాటించబోతున్నారట.ప్రస్తుత మంత్రులలో పదవులు కోల్పోతున్న ఐదుగురు మంత్రులలో ఓ మహిళా మంత్రి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  కొత్తగా ఎమ్మెల్సీగా ఎంపిక అవుతున్న ఓ కీలక నేతకు అవకాశం కల్పించబోతున్నారట.అలాగే సీమ జిల్లాలకు చెందిన ఒక మంత్రిని తప్పించి,  ఆస్థానంలో పార్టీ సీనియర్ గా ఉన్న ముఖ్య నేతకు మంత్రివర్గంలో అవకాశం కల్పించబోతున్నారట.

Telugu Ap, Ap Cm Jagan, Ap Ministers, Jagan, Ysrcp, Ysrcp Mlas, Ysrtp-Politics

గోదావరి జిల్లాలోని ఓ సీనియర్ మంత్రిని కూడా తప్పిస్తున్నారట.ఆయన రాజకీయ అనుభవం,  వయసు తక్కువైనా, మంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన వెనుకబడటంతోనే తప్పిస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన స్థానంలో గోదావరి జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించబోతున్నారట.దీంతో ప్రస్తుత మంత్రులలో టెన్షన్ మొదలైంది.

ఎవరెవరి పై వేటు పడుతుందో అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.ఇదిలా ఉంటే ప్రస్తుత శాసనమండలిలో వైసీపీకి కొత్తగా 18 మంది ఎమ్మెల్సీలు రాబోతున్నారు.

వారిలో కొందరికి మంత్రిగా అవకాశం దక్కబోతోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube