ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు ఈయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి…అయితే ఈయన ఇండస్ట్రీ కి వచ్చే ముందు మెగాస్టార్ చిరంజీవి తో కలిసి తంసాప్ యాడ్ ఫిల్మ్ లో నటించాడు దాంతో ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చిన్న క్యారెక్టర్లు చేసేవారు ఆ తరువాత చాలా మంచి క్యారెక్టర్లు కూడా చేశాడు ఆయన చేసిన సినిమాల్లో వెన్నెల(Vennela), ప్రస్థానం(Prasthanam) సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి ఇక సినిమాల విషయం పక్కన పెడితే శర్వ కి హైదరాబాద్(Hyderabad) లోనే చాలా ఫ్లాట్స్, బిజినెస్ లు ఉన్నట్లు గా తెలుస్తుంది ఒక ఇంటర్వ్యూ లో ఆయనే స్వయం గా చెప్పారు డబ్బుల కోసం అయితే నేను సినిమా చేయాల్సిన పని లేదు నాకు చాలా డబ్బులు ఉన్నాయి ఇంకా వస్తాయి అని చెప్పాడు… అలాగే నాకు సినిమా చేయడానికి కూడా కారణం నాకు డబ్బులు సంపాదించాలని కాదు, సినిమా అంటే నాకు పాషన్ అది నెరవేర్చుకోవడానికి సినిమాలు చేస్తున్న అంటూ తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది చెప్పకనే చెప్పేశాడు.
శర్వా, క్రిష్ తో చేసిన గమ్యం సినిమా కూడా చాలా అద్బుతం గా ఉంటుంది.ఈ సినిమా వల్లే ఆయన సోలో హీరోగా మొదటి సక్సెస్ అందుకున్నాడు.ఆ తరువాత చేసిన రన్ రాజా రన్ (Run Raja Run)సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది ఇక అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మొన్నటికి మొన్న ఒకే ఒక జీవితం అనే సినిమా తో సక్సెస్ సాధించి తన సత్తా ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు…ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలు సక్సెస్ సాధించాలి అని, అలాగే శర్వా కూడా తొందర్లోనే టాప్ హీరోగా ఎదగాలని కోరుకుందాం…