గురునానక్ జయంతికి కార్తీక పౌర్ణమి కి ఉన్న సంబంధం ఏమిటంటే..?

పదిమంది సిక్కు గురువులలో మొదటి గురువు గురునానక్ దేవ్( Guru Nanak ) అని దాదాపు చాలా మందికి తెలుసు.1469వ సంవత్సరంలో పాకిస్తాన్ లోని ప్రస్తుత లాహోర్ సమీపంలోని తల్వాండీ గ్రామంలో నానక్‌ దేవ్‌ కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ 29వ తేదీన హిందూ కుటుంబంలో జన్మించారు.

హిందూ, ఇస్లామీయ మత గ్రంథాలను చదివి అవగాహన చేసుకుని రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని ఈయన స్థాపించారు.

సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం. సిక్కులు ఏక్‌ ఓంకార్ నీ విశ్వసిస్తారు.నానక్‌ తండ్రి కళ్యాణ్ చంద్‌ దాస్‌( Kalyan Chand Das ) కలుమెహతాగా సుపరిచితులై, ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమస్తాగా పనిచేసే హిందూ పట్వారి.

What Is The Relationship Between Guru Nanak Jayanti And Kartika Poornami , Gur

తల్లి మతా త్రిపుర, అక్క బీబీ నాన్కీ, నానక్‌ దేవ్‌ బాల్యం నుంచే ప్రశ్నించే, ఆలోచించే తత్వం గలవారు.చిన్న వయసులోనే మతపరమైన ఉపనయనం చేసి జంధ్యం తిరస్కరించి,అంతకంటే భగవంతుని భగవ న్నామం యజ్ఞోపవీతం నూలుపోగులా తెగిపోవడం, మట్టిలో కలిసిపోవడం ఉండక, అఖండంగా రక్షణ కలిగిస్తుందని వాదించారు.చిన్న వయసు నుంచి అక్క బీబీ నాన్కీ తమ్ముని లో భగవంతుని జ్యోతిని చూడగా ఈ రహస్యాన్ని ఎవరితోనూ ఆమె పంచుకోలేదు.

ఆమె నానక్‌ జీ శిష్యులుగా పేరుపొందారు.బాల్యంలోనే హిందూమతంలోని తాత్వికతకు ఆకర్షితులై జీవిత రహస్యాలు అన్వేషణకై ఇల్లు వదిలిపోయారు.

What Is The Relationship Between Guru Nanak Jayanti And Kartika Poornami , Gur
Advertisement
What Is The Relationship Between Guru Nanak Jayanti And Kartika Poornami , Gur

ఈ క్రమంలోనే నానక్‌ జీ ముఖ్య తాత్వికులైన కబీర్‌, రవిదాస్‌ లను కలుసుకున్నారు.బతాలకు చెందిన వ్యాపారి మూల్‌ చంద్‌ చోనా కూతురు సులేఖినిని వివాహం చేసుకున్నారు.శ్రీచంద్‌, లక్ష్మీ దాస్ అనే( Lakshmi Das ) కుమారులు వారికి కలిగారు.28 సంవత్సరాల వయసులో నానక్‌ జీ ఒక ఉదయం నది స్నానం, ధ్యానానికి వెళ్ళగా మూడు రోజులు ఎవరికి కనిపించలేదు.తిరిగి వచ్చి దేవుని పవిత్రాత్మను నింపుకున్ననాని ప్రకటించారు.

ఆ తర్వాత హిందువు లేడు, ముస్లిం లేడు అని మత సామరస్య బోధనలను వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు.ఆ తర్వాత నాలుగు ప్రధాన దిశల్లో టిబెట్‌ దక్షిణాసియాలోని పలు ప్రాంతాలు అరేబియా, మక్కా, బాగ్దాత్, ముల్తాన్ తదితరులలో ఉదాసీలనే పేరున భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ ప్రయాణాలు సాగించారు.

Advertisement

తాజా వార్తలు