నందమూరి తారక రామారావు ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.అయితే నందమూరి తారక రామారావు పేరు మీద ఇద్దరు హీరోలు ఉన్నారు.
ఒకరు సీనియర్ ఎన్టీఆర్ అయితే మరొకరు జూనియర్ ఎన్టీఆర్.ఇక సీనియర్ ఎన్టీఆర్ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కూడా తాతకు తగ్గ మనవడిగా ఆయనకు ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన 40 వ పుట్టినరోజుని గ్రాండ్ గా జరుపుకుంటున్నారు…
ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈయన అభిమానులు దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇక jr.ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి.అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక విషయం తెలుసుకుందాం.అదేంటంటే తారక రామ్ అని ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పేరుని నందమూరి తారక రామారావు అని మార్చింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తారక రామ్ అనే పేరుని నందమూరి తారకరామారావు అని పెట్టింది తన సొంత తాత సీనియర్ ఎన్టీఆర్ ( Sr.NTR) గారట.
జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో ఓ రోజు తనని తీసుకొని రమ్మని హరికృష్ణ కి సీనియర్ ఎన్టీఆర్ చెప్పారట.దాంతో జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొని హరికృష్ణ( Hari Krishna ) తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు.అలా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని నీ పేరు ఏంటి అని అడగగా నా పేరు తారక రామ్ అని చెప్పారట.అలాగే హరికృష్ణ ని జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన తేదీ, వారం, సమయం అన్ని అడిగి తెలుసుకున్నారట.
అయితే ఈ విషయాలన్నీ చెప్పాక సీనియర్ ఎన్టీఆర్ ( Sr.NTR ) గారు జూనియర్ ఎన్టీఆర్ చేయి చూసి ఆ తర్వాత హరికృష్ణ ని పిలిచి వీడి పేరు తారక రామ్ కాదు నా పేరు పెడుతున్న నందమూరి తారక రామారావు.ఇప్పటినుండి వీడిని ఇదే పేరుతో పిలవండి అని హరికృష్ణ కి చెప్పారట.అయితే ఈ విషయాలన్నీ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఈ పేరు పెట్టాక సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినితో వీడు నా తర్వాత నా అంతటి గుర్తింపుని తెచ్చుకుంటాడు అని కూడా చెప్పారట.అయితే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ జాతకాలు వంటివి ఎక్కువగా నమ్మేవారు…
.