American grandmother : ఈ అమెరికా బామ్మకు అదృష్టం ఏ రేంజ్ లో ఉందంటే....ఏకంగా రెండు సార్లు...

అదృష్టం అందరిని ఒకే విధంగా వరించదు.

కొందరికి కష్టపడాల్సిన దానిలో 10% కష్టపడిన అదృష్టం వాళ్ళ తలుపు తడుతుంది, మరికొందరికి జీవీత కాలం కష్టపడిన అదృష్టం కలిసిరాదు.

అదృష్టానికి సరైన ఉదాహరణ ఇవ్వాలంటే లాటరి.ఎంతోమంది తమ అదృష్టాన్ని ఈ లాటరీ ద్వారా పరీక్షించుకుంటారు, కానీ అది మాత్రం చాలా తక్కువ మందిని గెలిపిస్తుంది.

ఒక లాటరీ గెలవటం అదృష్టమైతే, అదే వ్యక్తి రోజుల వ్యవధిలో మరొక లాటరీ గెలిస్తే.షాక్ అవ్వాల్సిందే.

ఇలాంటి సంఘటనే అమెరికాలో ఒక బామ్మ కు జరిగింది.నెవార్క్ లోని 70ఏళ్ళ వృద్ధురాలికి లాటరీ టికెట్స్ కొనే అలవాటు ఉంది.

Advertisement
What Is The Range Of Luck For This American Grandmother Twice At Once , America,

ఆ అలవాటు ప్రకారమే ఒకరోజు లాటరీ టికెట్ కొనిగోలు చేసి, దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్న ఈ బామ్మకు అక్టోబర్ 20న అదృష్టం కలిసొచ్చి లాటరీ ప్రైజ్ మెనీ గెలుచుకుంది.ఎంతనుకుంటున్నారు, అక్షరాల రూ.82.80 లక్షలు.ఇక ఈ వృద్ధురాలి సంతోషానికి అవధుల్లేవు.

వెంటనే, ఆ ప్రైజ్ మనీ తీసుకోవటానికి డెలావర్ లాటరీ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి, తాను గెలుచుకున్న మొత్తాన్ని తీసుకుంది.ఇక్కడ దాక ఒక విధంగా ఉంది కదా, తిరిగి ఇంటికి వెళ్ళే దారిలో, అలవాటు ప్రకారం ఇంకో లాటరీ టికెట్ నుకొనుగోలు చేసింది ఈ బామ్మా గారు అయితే.

What Is The Range Of Luck For This American Grandmother Twice At Once , America,

టికెట్ కొన్న 3వ రోజు మళ్ళీ ఈమె కొన్న టికెట్ కే లాటరీ తగిలింది.ఈసారి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.అక్షరాలా రూ.2.8 కోట్లు.ఈ విషయం తెలుసుకున్న ఆ బామ్మ ఎగిరి గంతేసినంత పని చేసింది.అంటే మూడు రోజుల వ్యవధిలో ఈ బామ్మ 3.60 కోట్లకు యజమానురాలైంది.భలే విచిత్రంగా ఉంది కదా.ఈ క్రమంలోనే వచ్చిన మనీతో.ఏమి చేస్తారని అడిగితే దానికి ఆమె చెప్పిన సమాధానం ఇలా ఉంది.

గెలుచుకున్న మనీలో ఎక్కువ భాగాన్ని ఆమె రిటైర్మెంట్ ఫండ్ లో పెట్టాలనుకుంటున్నాను అని తెలియచేసింది.ఇప్పుడు చెప్పండి, నిజంగా అదృష్టమంటే ఈ బామ్మ దే కదా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు