మాఘ మాసంలో నదీ స్నాన విశిష్టత ఏమిటి... పొరపాటున కూడా చేయకూడని పనులివే!

హిందూ సాంప్రదాయాల ప్రకారం తెలుగు 12 నెలలలో కొన్ని నెలలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.అలాంటి వాటిలో మాఘమాసం ఒకటి.

కార్తీకమాసంలో మనం వెలిగించే దీపానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తామో మాఘమాసంలో చేసే స్నానాలకు అదే ప్రాముఖ్యత ఇస్తారు.ఇలా మాఘమాసంలో చాలామంది నెల మొత్తం మాఘ స్నానాలు చేస్తూ పెద్దఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈ క్రమంలోనే మాఘ మాసంలో నదీ స్నానాలకు ఉన్న విశిష్టత ఏమిటి ఈ మాసంలో ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మాఘమాసంలో చేసే స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు.ఈ క్రమంలోనే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి నదీ స్నానం చేసిన అనంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా భావిస్తున్నారు.

ఇలా మాఘమాసంలో నదీ స్నానం చేసి సూర్యభగవానుడిని నమస్కరించడం వల్ల మాఘ మాసంలో దివ్య పుణ్యక్షేత్రాలను సందర్శించి పాపపరిహారం కోరినంత పుణ్య ఫలం దక్కుతుంది.ఇక నదీస్నానం ఆచరించే సమయంలో స్నానం చేసేటప్పుడు “దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!” అనే మంత్రాన్ని చదవటం శుభప్రదం./br>

What Is The Imaportance Of River Bathing In The Month Of Magha Masam Things Not

ఈ విధంగా మాఘ స్నానం చేసిన అనంతరం ఇష్టదైవంను ఆరాధన చేయాలి అదే విధంగా ఈ నెల మొత్తం కొన్ని పనులకు దూరంగా ఉండటం వల్ల స్నానానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని పండితులు చెబుతుంటారు.చాలామంది ఈ నెలరోజులు మొత్తం ముల్లంగికి దూరంగా ఉంటారు.అదేవిధంగా మాంసాహారాన్ని కూడా తీసుకోరు.

What Is The Imaportance Of River Bathing In The Month Of Magha Masam Things Not

అలాగే ఇతరులపై కోపం ప్రదర్శించకుండా నిత్యం ఆ భగవన్నామస్మరణలో ఉంటారు.ఇకపోతే ఈ మాసంలో నువ్వులను దానం చేయడం ఎంతో శుభకరంగా భావిస్తారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

తాజా వార్తలు