Instagram: ఇన్ స్టాగ్రామ్ లో మరో ప్రైవసీ ఫీచర్.. ఇంతకి ఆ ఫీచర్ ఏంటంటే..?

ఇన్ స్టాగ్రామ్( Instagram ) తమ వినియోగదారుల ప్రైవసీ కోసం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది.

దీంతో ప్రైవసీకి( Privacy ) పెట్టింది పేరుగా ఇన్ స్టాగ్రామ్ కు ఆదరణ పొందుతోంది.

అయితే ఇన్ స్టాగ్రామ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రైవసీ ఫీచర్ ను త్వరలోనే తమ యూజర్లకు పరిచయం చేయనుంది.ఇంతకీ ఆ ప్రైవసీ ఫీచర్ ఏమిటో.

ఆ ప్రైవసీ ఫీచర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం.ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్టులు, స్టోరీలు ఇకపై ఎంపిక చేసిన వారికి మాత్రమే కనిపించేలా చేయడం కోసమే కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది.

ఫ్లిప్ సైడ్( Flipside ) పేరుతో ఓ సరికొత్త ప్రైవసీ ఫీచర్ ను తమ యూజర్లకు త్వరలోనే పరిచయం చేస్తున్నట్లు సంస్థ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు.

Advertisement

ఈ ఫ్లిప్ సైడ్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ తో ప్రస్తుత ప్రొఫైల్ ప్రత్యామ్నాయ అకౌంటుగా మారుతుంది.

ఈ అకౌంట్ ప్రాథమిక ఖాతాతో లింక్ అయి ఉంటుంది.

ఇన్ స్టాగ్రామ్ యూజర్లు తమకు నచ్చిన పేరు, బయోడేటా, ఫోటో తో వ్యక్తిగతీకరించిన ప్రొఫైల్ లను సృష్టించుకోవచ్చు.ఈ ప్రొఫైల్ లో యూజర్లు ఏదైనా పోస్ట్,( Post ) రీల్,( Reel ) స్టోరీ తమకు నచ్చిన వారికి మాత్రమే కనిపించేలా షేర్ చేసుకోవచ్చు.ఈ ఫ్లిప్ సైడ్ ప్రైవసీ ఫీచర్ ఎలాంటి వినియోగదారులకు ఉపయోగపడుతుంది అంటే.

తాము పోస్ట్ చేసే కంటెంట్ ను కేవలం కొందరు మాత్రమే చూడాలి అనుకునే వారికి ఉపయోగపడుతుంది.అయితే ఎప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో చెప్పలేదు కానీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఇన్ స్టాగ్రామ్ తెలిపింది.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు