ఆరోగ్యానికి `ఫైబ‌ర్` ఎన్ని విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే పోష‌కాలు అన్నీ శ‌రీరానికి అందాలి.వాటిలో ఫైబ‌ర్ కూడా ఒక‌టి.

ఫైబ‌ర్‌నే పీచు పదార్థం అని కూడా అంటారు.ఈ ఫైబ‌ర్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

కానీ, చాలా మంది ఫైబ‌ర్‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.కొంద‌రైతే ఫైబ‌ర్ శ‌రీరానికి మంచిది కాద‌ని కూడా భావిస్తుంటారు.

వాస్త‌వానికి శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చెయ్యాలంటే ఫైబ‌ర్ చాలా అవ‌స‌రం.అలాగే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా కూడా ర‌క్షిస్తుంది.

Advertisement

గుండె సంబంధిత జ‌బ్బులు రాకుండా చేయ‌డంలోనూ, మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డ‌కుండా ర‌క్షించ‌డంలోనూ, భయంక‌ర‌మైన క్యాన్స‌ర్ స‌మ‌స్య‌కు దూరంగా ఉంచ‌డంలోనూ,

రక్త పోటును

అదుపులో ఉంచ‌డంలోనూ.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఫైబ‌ర్ ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాగే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ సులువుగా క‌రుగుతుంది.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేసి.

జీర్ణ శ‌క్తి పెంచ‌డంలోనూ ఫైబ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇక ఫైబ‌ర్ ఉండే ఆహారం తీసుకోవడం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.ఎందుకంటే, బ‌రువును త‌గ్గించ‌డంలో ఫైబ‌ర్ కీల‌క పాత్ర పోషిస్తుంది.కాబ‌ట్టి, ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటే ఆహారం అంటే.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

కూర‌గాయ‌లు, పండ్లు, తృణ ధాన్యాలు, పప్పుదినుసులు వంటివి తీసుకోవాలి.అలాగే ఓట్స్, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ, మష్రుమ్స్‌, బ్రౌన్ రైస్‌, అవిసె గింజలు, ఆవకాడో, యాపిల్‌, స్ట్రాబెర్రీ, గూస్ బెర్రీస్, జీడిపప్పు, బాదం ప‌ప్పు వంటి వాటిల్లో కూడా ఫైబ‌ర్ ఉంటుంది.

Advertisement

మ‌రి ఇంత‌కీ ఫైబ‌ర్ రోజుకు ఎంత తీసుకోవాలి.అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.

అయితే పురుషులు 35 గ్రాములు, స్త్రీలు 25 గ్రాములు ఫైబ‌ర్ తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కానీ, చాలా మంది శ‌రీరానికి కావాల్సినంత ఫైబ‌ర్‌ను తీసుకోవ‌డం లేదు.

దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబ‌ట్టి, ఇక‌నైనా మీ శ‌రీరానికి కావాల్సినంత‌ ఫైబ‌ర్‌ను అందించండి.

తాజా వార్తలు