కరోనా తర్వాత ఏం జరుగుతుంది.. బ్రహ్మంగారు కాలజ్ఞానం లో ఏం చెప్పారు?

మన భారతదేశంలో ప్రజలు ఎక్కువగా జ్యోతిషశాస్త్రానికి ప్రాధాన్యతనిస్తారు.ఎంతో సాంకేతిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మంది జ్యోతిష్య శాస్త్రాలను ఎంతో విశ్వసిస్తారని చెప్పవచ్చు.

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ఆధారంగా మార్పులు జరుగుతాయని భావిస్తుంటారు.మన పూర్వికులు ఉన్న అపర మేధాశక్తితో జరగబోయే విషయాలన్నింటినీ ముందుగానే తెలియజేశారు.

అలాంటి వాటిలో "బ్రహ్మంగారి కాలజ్ఞానం" ఎంతో ప్రాచుర్యంలో ఉంది.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఏం జరుగుతుందో ముందుగానే రాసి ఉంచారు.

కాలక్రమేణా మన సమాజంలో మార్పులు చోటు చేసుకుంటే ఈ విషయాలన్నింటినీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపారని చెబుతుంటారు.ఇలాంటి వాటిలో వేప చెట్టుకు పాలు కారడం,సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం మూత పడుతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.

Advertisement
Corona Virus, Future,hindu Myth, Brahmangari Prophecy, Astrology, Sri Potul

అదే విధంగానే కరోనా సమయంలోవెంకటేశ్వరస్వామి ఆలయం మూతపడటం మనం చూస్తూనే ఉన్నాం.అలాగే 2020 వ సంవత్సరంలో విజృంభించిన అతి భయంకరమైన మహమ్మారి కరోనా గురించి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారు.

"కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి, కోడిలాగ తూగిసచ్చేరయ" అంటూ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నట్టు తెలిపారు.ఇందుకు సంబంధించిన విశేషాలు కరోనా సమయంలో సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యాయి.

Corona Virus, Future,hindu Myth, Brahmangari Prophecy, Astrology, Sri Potul

బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నట్లు కరోనా విజృంభించింది.అయితే వచ్చే నూతన సంవత్సరంలో కరోనా మహమ్మారి తరువాత ఏర్పడిన భయంకరమైన పరిస్థితులు ఇంతటితోనే ఆగిపోవని ఇలాగే కొనసాగుతాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే బ్రహ్మం గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది.

అందుకు నిదర్శనంగా బ్రిటన్ లో నమోదైన కొత్త స్ట్రెయిన్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది.ఈ వైరస్ కారణంగా బ్రిటన్ లో లాక్ డౌన్ విధించారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

ఈ విధంగా చూస్తే బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నది మరొకసారి కూడా నిజమవుతుందని తెలుస్తోంది.ఈ సంవత్సరం కూడా కరోనా నుంచి బయటపడటమే కాకుండా మరో కొత్త వైరస్ తో పోరాడాలని బ్రహ్మం గారు ముందే చెప్పారు.

Advertisement

తాజా వార్తలు