అనసూయ పరిస్థితి ఏంటి ఇలా అయింది... టాప్ 3 నుంచి టాప్ 10 లోకి వచ్చిన యాంకరమ్మ!

అనసూయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఈమె జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇదే పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

 What Happened To Anasuya Yankaramma Came From Top 3 To Top 10 Anasuya, Anchor  A-TeluguStop.com

ఇలా పలు సినిమాలలో నటించిన అనసూయ వరుస సినిమా అవకాశాలను అందుకొని సినిమాలతో పూర్తిగా బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి కూడా గుడ్ బై చెప్పారు.అయితే జబర్దస్త్ కార్యక్రమానికి ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయంలో యాంకర్లలో టాప్ త్రీ పొజిషన్లో ఉండేవారు.

యాంకర్ సుమ వంటి వారి తర్వాత అనసూయ పేరే వినిపించేది.ఇలా యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ సినిమాల పరంగా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బాయ్ చెప్పి వెళ్లి పెద్ద తప్పు చేసిందని చెప్పాలి.

జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈమె నటించిన సినిమాలలో కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.అయితే ప్రస్తుతం ఎలాంటి బుల్లితెర కార్యక్రమాలు కూడా చేతిలో లేవు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలు లేకుండా మరోవైపు సినిమాలు కూడా సరైన హిట్ లేకపోవడంతో టాప్ త్రీ లో ఉన్నటువంటి అనసూయ ఏకంగా టాప్ టెన్ పొజిషన్ కి వచ్చారని టాక్.ఇక అనసూయ విషయంలో అభిమానుల సైతం కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి తప్పు చేసిందని,ఈ విషయం అనసూయ త్వరగా గ్రహించి ఇతర కార్యక్రమాల ద్వారా మరోసారి బుల్లితెరపై సందడి చేయడం మంచిది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube