1947 ఆగస్టు 10 నుంచి 15 మధ్య ఏం జరిగిందో తెలుసా..!

1947 ఆగస్టు 14, 15 తేదీలలో పాకిస్తాన్, భారత్ లకు స్వాతంత్రం రావడంతో రెండు దేశాల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.రెండు దేశాలలో ఉండే ప్రజలు సంతోషంలో మునిగిపోయారు.

 What Happened Between 10th And 15th August Before The Independence Of India Deta-TeluguStop.com

స్వాతంత్రానికి ముందు అంటే 1947 ఆగస్టు 10 నుంచి 15 వరకు రెండు దేశాలలో ఉత్కంఠ భరితమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 10:

1947 ఆగస్టు 10 న( 1947 August 10 ) రాజసంస్థానాలపై ఒత్తిడి పెరిగింది.భారత్ లేదా పాకిస్తాన్ లలో ఏదో ఒక దానిలో విలీనం కావాలని కాంగ్రెస్, ముస్లిం లీగ్ నేతలు మహారాజాలపై తీవ్ర ఒత్తిడి చేశారు.

రాజా యశ్వంత్ రావు సారథ్యంలోని సంధూర్ రాజసంస్థానం భారత్లో కలిసేందుకు అంగీకరించింది.పాక్ అనుకూల సంధి ముస్లింలు జునాగడ్ నవాబును చుట్టుముట్టి పాక్ లో చేరాలని పట్టుబట్టారు.దేశ విభజన కారణంగా ప్రజలు పాకిస్తాన్, భారత్ లకు వెళ్లడం కోసం ప్రత్యేకంగా 30 రైళ్లను ఏర్పాటు చేశారు.

ఆగస్టు 11:

పాకిస్తాన్ కు వెళ్లే ప్రయాణికులతో ఢిల్లీ రైల్వే స్టేషన్( Delhi Railway Station ) కిక్కిరిసింది.పాక్ రాజ్యాంగ సభ సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా( Mohammed Ali Jinnah ) తొలి ప్రసంగం చేశారు.అనంతరం పాకిస్తాన్( Pakistan ) తన జాతీయ జెండాను ఖరారు చేసుకుంది.

భారత్లో చేరేందుకు మణిపూర్ సంస్థానం అంగీకరించింది.భారతదేశంలోని దేశభక్తులు వందేమాతరం, 1857 వంటి సినిమాలలోని గీతాలను అలపిస్తూ భారత వీధులలో తిరిగారు.

Telugu August, Delhi, India, Mahatma Gandhi, Mohammadali, Pakistan-General-Telug

ఆగస్టు 12:

భారత్, పాకిస్తాన్ లతో యథాతథ స్థితి ఒప్పందానికి కాశ్మీరు మహారాజా హరి సింగ్( Kashmir King Hari Singh ) ప్రతిపాదన.ఢిల్లీ డాన్ దినపత్రిక కార్యాలయానికి నిప్పు పెట్టారు.రెండు దేశాలను విభజించే సరిహద్దు రేఖలు సిద్ధమయ్యాయి.

Telugu August, Delhi, India, Mahatma Gandhi, Mohammadali, Pakistan-General-Telug

ఆగస్టు 13:

పాకిస్తాన్ కు వెళ్లే రైలు ఎక్కడానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ముస్లిం మహిళలతో కిక్కిరిసిపోయింది.భారత్లో త్రిపుర సంస్థానాన్ని( Tripura ) విలీనం చేసే ఒప్పందంపై త్రిపుర మహారాణి కంచనప్రవ దేవి సంతకం చేసింది.ఫెడరల్ కోర్టు చీఫ్ జస్టిస్ హరిలాల్ జెసి సుందర్ కనియా భారత సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Telugu August, Delhi, India, Mahatma Gandhi, Mohammadali, Pakistan-General-Telug

ఆగస్టు 14:

స్వతంత్ర్య పాకిస్తాన్ ఆవిర్భవించింది.తోలి గవర్నర్ జనరల్ గా మహమ్మద్ అలీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు.మొట్టమొదటి ప్రధానిగా లియాఖత్ అలీ ఖాన్ నియమితులయ్యారు.ఢిల్లీలో మౌంట్ బాటన్ నివాసంపై బ్రిటిష్ జాతీయ పతాకం యూనియన్ జాక్ పతాకం ను అవనతం చేశారు.భారత రాజ్యాంగ సభ సమావేశం అయింది.స్వతంత్ర భారత తొలి శాసనసభగా ఆవిర్భవించేందుకు చర్చలు జరిగాయి.

ఆగస్టు 15:

ఆరోజు అర్ధరాత్రి 12 గంటలకు స్వేచ్ఛగా భారతీయులందరూ వీధులలో తిరిగారు.జనగణమన గీతం అలపించారు.

భారత తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ( Jawaharlal Nehru ) ప్రమాణ స్వీకారం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube