ఈ ఏనుగు పిల్ల ఆటలాడుతూ ఏం చేసిందో చూస్తే నవ్వే నవ్వు..

What Did This Baby Elephant Do While Playing, Elephant, Funny Video, Viral Video, Viral News, Elephant Playing, Elephants

భారీ శరీరం ఉన్నా ఏనుగులు( elephants ) తరచుగా పిల్ల చేష్టలు చేస్తూ తమలోని సరదా కోణాన్ని చూపిస్తుంటాయి.ఇక ఏనుగు పిల్లలు ఖాళీ సమయంలో డ్యాన్స్‌లు చేస్తాయి.

 What Did This Baby Elephant Do While Playing, Elephant, Funny Video, Viral Video-TeluguStop.com

ఫన్నీగా పండిబోర్లుతాయి.ఇంకా ఇవి చాలా అల్లరి, చిలిపి చేష్టలు చేస్తుంటాయి.

కాగా తాజాగా ఒక ఏనుగు పిల్ల ( baby elephant )తనకు ఎవరూ తోడు లేకపోవడంతో తనకు తానే ఆడుకుంది.ఇది తన తొండాన్ని గుండ్రంగా తిప్పుతూ పైకి కిందకు ఆడిస్తూ భలే ముచ్చటగా ఎంజాయ్ చేసింది.

దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వైరల్ కంటెంట్ షేరింగ్ ట్విట్టర్ పేజీ అయిన @TheFigen రీసెంట్‌గా షేర్ చేసింది.ఈ వీడియోకి ఇప్పటికే 26 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక ఏనుగుల మంద కనిపించడం చూడవచ్చు.ఆ మంద మధ్యలో క్యూట్ గా కనిపించే ఒక ఏనుగు పిల్ల కూడా ఉంది.

ఏనుగు పిల్లకి తోడుగా చిన్న ఏనుగులు ఏవీ కనిపించలేదు.దాంతో అది తనకు తానే ఆడుకుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.చిన్నప్పుడు మనం కూడా మన చేతులను ఏ కారణం లేకుండా ఇలానే తిప్పుతూ ఆడుకునే వాళ్ళమని ఒక యూజర్ గుర్తు చేశాడు.స్నానం చేసి బయటకు వచ్చాక తలను ఇంతే ఊపుతామని మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఎవరూ తోడు లేకపోయినా ఎవరికివారు ఇలా ఆడుకోవడం మనుషులకి కూడా అలవాటే అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube