బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ( Parineeti Chopra ) ఆప్ ఎంపీ రాఘవ చద్దా గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరిద్దరూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లీలా ప్యాలెస్ లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
ఇక వీరి పెళ్లికి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అంతేకాకుండా వీరు పెళ్లి చేసుకోబోయే హోటల్ ఖరీదు ఒక రోజుకు ఎంతో కూడా నెట్టింట్లో చక్కెర్లు కొట్టాయి.
అయితే ఇదంతా స్టార్ సెలబ్రిటీల జీవితాల్లో కామనే.కానీ ఆ విషయంలో పరిణితి చోప్రా అచ్చం అలియా భట్ ( Alia Bhatt ) నే ఫాలో అయింది అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ మ్యాటర్ ని వైరల్ చేస్తున్నారు.

మరి అలియా భట్ ని పరిణితి చోప్రా ఏ విషయంలో ఫాలో అయింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.అలియా భట్ రణ్ బీర్ కపూర్ ( Ranbeer kapoor ) ఇద్దరూ 2022లో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక అలియా భట్ తన పెళ్లిలో చాలా సింపుల్ గా క్రీమ్ పేస్టల్ కలర్ లో ఉండే పెళ్లి డ్రెస్ వేసుకొని అందర్నీ ఆకర్షించింది.ఒకప్పుడు చాలామంది పెళ్లి చేసుకునేవారు గ్రీన్ లేదా వైట్, రెడ్, ఎల్లో వంటి పెళ్లి బట్టల్లో కనిపించేవారు.

కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది పేస్టల్ కలర్స్ నే ఎంచుకుంటున్నారు.ఇక ఈ బట్టలు చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి.ఇక పరిణతి చోప్రా కూడా అచ్చం అలియా భట్ ( Alia Bhatt ) పెళ్లికి వేసుకున్న పేస్టల్ కలర్ డ్రెస్ నే ఫాలో అయ్యి ఆమె కూడా అలాంటి కలర్లో ఉన్న పెళ్లి డ్రెస్సే ధరించింది.ఇక మరో విషయం ఏమిటంటే చాలామంది సెలబ్రిటీలు పెళ్లికి మెహేంది విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అద్భుతమైన డిజైన్స్ వేయించుకుంటారు.
కానీ ఆలియా భట్ మాత్రం చాలా సింపుల్ మెహందీ లో కనిపించింది.ఇక సేమ్ ఆలియా భట్ లాగే పరిణితి చోప్రా ( Parineeti Chopr a) కూడా తన పెళ్లికి సింపుల్ మెహందీ వేసుకుని అందర్నీ ఆకట్టుకుంది.
అయితే తాజాగా వీరిద్దరి పెళ్లి విషయంలో ఉన్న కామన్ పాయింట్స్ ని కొంతమంది నెటిజన్స్ వైరల్ చేస్తూ ఈ విషయాల్లో పరిణితి చోప్రా అలియా భట్ నే ఫాలో అయింది అంటూ వీరి ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు.