మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని కుర్రతండాలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏం పనులు చేయలేకపోయానన్నారు.అందుకే రాజీనామా చేస్తేనైనా అభివృద్ధి చేస్తారని భావించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.రాజీనామా చేసిన తరువాతి రోజే కేసీఆర్ మునుగోడు కు వచ్చారని, ఆ రాజీనామా దెబ్బతోనే మంత్రులు, ఎమ్మెల్యే ప్రజల ఇళ్లకు వస్తున్నారని వెల్లడించారు.
పది మందికి సహాయం చేసే వాడినన్న రాజగోపాల్ రెడ్డి.తనను కొనే శక్తి ఉందా ఎవరికైనా అని ప్రశ్నించారు.
అందరిలా ఒక పార్టీపై గెలిచి ఇంకో పార్టీ మారలేదన్నారు.తనను గెలిపించిన ప్రజలు తలదించుకునేలా చేయను అని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.