మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన న్యూట్రియంట్స్ లో విటమిన్ సి( Vitamin C ) ఒకటి.ఇది వాటర్ లో కరిగి విటమిన్.
మన బాడీ విటమిన్ సిను నిల్వ చేసుకోలేదు.కాబట్టి రెగ్యులర్ గా శరీరానికి విటమిన్ సి అందించడం చాలా అవసరం.
లేదంటే విటమిన్ సి లోపం( Vitamin C Deficiency ) ఏర్పడుతుంది.సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది విటమిన్ సి లోపాన్ని గుర్తించలేకపోతుంటారు.
ఈ నేపథ్యంలోనే విటమిన్ సి లోపం వల్ల మనలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? అసలు విటమిన్ సి వల్ల ఉపయోగాలేంటి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని( Immunity Power ) పెంచుతుంది.జలుబు, ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.అలాగే ఎముకల మరియు కండరాల బలానికి విటమిన్ సి అనేది ఎంతో అవసరం.
శరీరంలో ఐరన్ సరిగ్గా గ్రహించేందుకు విటమిన్ సి సహాయపడుతుంది.రక్తహీనత బారినపడకుండా కాపాడుతుంది.
ఆయాసం, అలసటను తగ్గించడంలో.మానసిక ఒత్తిడిని చిత్తు చేయడంలో.
గుండె సంబంధిత వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో.రక్తపోటును నియంత్రణలో కూడా విటమిన్ సి తోడ్పడుతుంది.
అంతేకాకుండా విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.ఇది చర్మాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
మరియు విటమిన్ సి ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా మెరిసేలా కూడా ప్రోత్సహిస్తుంది.

విటమిన్ సి లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ఆకలి తగ్గిపోవడం, అలసట, బలహీనత, మూడ్ స్వింగ్‌లు విటమిన్ సి లోపం ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలు.అలాగే తరచుగా జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల( Viral Infections ) బారిన పడటం, గాయాలు త్వరగా మానకపోవడం, డ్రై స్కిన్, చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటిపూత, పళ్ళు కదిలిపోవడం, ఎముకలు బలహీనపడడం, కీళ్ల నొప్పులు లేదా వాపులు, రక్తహీనత, మానసిక ఆందోళన, డిప్రెషన్, నీరసం.
ఇవన్నీ కూడా విటమిన్ సి లోపం తలెత్తినప్పుడు కనిపించే లక్షణాలే.మీకు ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా జాగ్రత్త పడాలి.
రోజూ తగిన మోతాదులో విటమిన్ సి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.నారింజ, ముసంబి, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివి, టమోటా, మామిడి పండు, బ్రోకోలీ, క్యాప్సికం, పాలకూర, కొత్తిమీర, పుచ్చకాయ, పచ్చి బఠానీ లాంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా విటమిన్ సి లోపాన్ని దూరం చేసుకోవచ్చు.







