‘ఎన్టీఆర్‌’లో ఆ సీన్స్‌ పరిస్థితి ఏంటీ... సినీ, రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్‌ రూపొందించిన ‘ఎన్టీఆర్‌’ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది.బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో నటించిన ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది.

 What About Political Part In Ntr Movie-TeluguStop.com

రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతున్న ఈ చిత్రంను తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ను రెండవ పార్ట్‌లో రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు.

మొదటి పార్ట్‌లో ఎలాంటి వివాదాలు ఉండవు.కాని రెండవ పార్ట్‌ విషయానికి వచ్చేప్పటికి రాజకీయాలకు సంబంధించిన పలు విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి.ఎన్టీఆర్‌ పార్టీ పెట్టింది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.చంద్రబాబు నాయుడు ఈమద్య కాలంలో రాహుల్‌ గాంధీతో రాసుకు పూసుకు తిరుగుతున్నాడు.దాంతో ఎన్టీఆర్‌ మూవీలో కాంగ్రెస్‌ గురించిన ప్రస్తావన ఉంటుందా, ఎన్టీఆర్‌ అప్పట్లో చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు సినిమాలో చూపిస్తారా అంటూ చర్చ జరుగుతోంది.

ఇప్పుడిప్పుడే తెలుగు దేశం, కాంగ్రెస్‌ల మద్య స్నేహం చిగురిస్తుంది.ఇలాంటి సమయంలో ఎన్టీఆర్‌ మూవీలో ఆ డైలాగ్స్‌ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాల్లో కాంగ్రెస్‌ గురించి విమర్శిస్తే ఒక గొడవ, విమర్శించకుంటే మరో గొడవ అన్నట్లుగా పరిస్థితి ఉంది.మరి క్రిష్‌ ఎలా ప్లాన్‌ చేశాడో అంటూ రాజకీయ మరియు సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube